'అర్జున్ రెడ్డి' సీక్వెల్ గురించి విజయ్
Send us your feedback to audioarticles@vaarta.com
యూత్ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా, సంచలన దర్శకుడు సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అర్జున్ రెడ్డి’. ఈ సినిమాతో నటుడిగా మరో మెట్టు ఎదిగారు విజయ్. ఈ చిత్రంలో కథ, కథనం, ట్రీట్‌మెంట్ అన్ని ఆకట్టుకునేలా రూపొందించారు దర్శకుడు సందీప్ రెడ్డి. తక్కువ బడ్జెట్‌తో సినిమాను తెరకెక్కించి దాదాపు పది రెట్ల వరకు లాభాల్ని రాబట్టుకున్నారంటే దర్శకుడు ప్రతిభ ఏపాటిదో అర్ధం చేసుకోవచ్చు. ఇంత ఘనవిజయం సాధించిన ఈ సినిమా సీక్వెల్ గురించి విజయ్ దగ్గర ప్రస్తావిస్తే.. ఆయన కూడా సీక్వెల్ తీస్తే బాగుంటుందనే సమాధానం ఇచ్చారు.
అంతేగాకుండా.. దీనిపై గతంలో తనకు, సందీప్‌కు మధ్య చర్చలు జరిగాయని కూడా విజయ్ చెప్పారు. ఈ సీక్వెల్‌లో 40 ఏళ్ళు వచ్చిన తర్వాత ‘అర్జున్ రెడ్డి’ ఎలా ఉంటాడు? అతని పరిస్థితి ఏంటి? అన్నది చూపిస్తే బాగుంటుందని విజయ్ తన అభిప్రాయాన్ని తెలియజేశారు. అయితే.. ప్రస్తుతం సందీప్.. మహేష్‌తో చేయబోయే సినిమా కోసం స్క్రిప్ట్ వర్క్‌లో తలమునకలై ఉన్నారు. అలాగే.. రామ్ చరణ్‌తో కూడా ఓ సినిమా చేయబోతున్నారని సమాచారం. ఇక.. విజయ్ కూడా వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. మరి వీరి కమిట్‌మెంట్స్ పూర్తయ్యాకే ‘అర్జున్ రెడ్డి’ సీక్వెల్ పట్టాలెక్కుతుందేమో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com