సినిమాలు కారణం కాదంటున్న విజయ్...
- IndiaGlitz, [Thursday,August 04 2016]
దర్శకుడు ఎ.ఎల్.విజయ్, నటి అమలాపాల్ ఇద్దరూ న్యాయ పరంగా విడిపోనున్నారు. ఈ విషయంపై వస్తున్న వార్తలకు దర్శకుడు విజయ్ క్లారిటీ మరోసారి క్లారిటీ ఇచ్చేశాడు. అయితే గతంలో అమలాపాల్‌ను అత్తమామలు వేధింపులకు గురి చేశారని, ఆమె సినిమాలు చేయడమే కారణమని వార్తలు వినపడ్డాయి. అయితే తాను అమలా సినిమాలు చేయడానికి వ్యతిరేకం కాదని, నిజానికి పెళ్ళి తర్వాత తానే ఆమెను సినిమాలు చేయమని ఎంకరేజ్ చేశానని అన్నారు. దాంతో ఇప్పటి వరకు వస్తున్న వార్తలకు బ్రేక్ పడి అసలు వీరిద్దరూ విడిపోవడానికి కారణమేంటని చర్చ మళ్ళీ మొదలైంది. మరి కొందరైతే అమలాకు ఢిల్లీకి చెందిన ఫ్యాషన్ డిజైనర్‌తో రిలేషన్ వల్లే ఇంత రచ్చ జరుగుతుందని అంటున్నారు. మరి అసలు కారణమేంటో అమలాపాల్ అయినా చెబుతుందా చూడాలి..