విజయ్ ఆంటోని ‘విజయ రాఘవన్’ మే 14న రిలీజ్
Send us your feedback to audioarticles@vaarta.com
నకిలీ, డా.సలీమ్, బిచ్చగాడు, భేతాళుడు, ఇంద్రసేన, రోషగాడు, కిల్లర్ వంటి చిత్రాలతో టాలీవుడ్‌లో తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సంపాదించుకున్న హీరో విజయ్ ఆంటోని. ఈయన హీరోగా.. మెట్రో వంటి డిఫరెంట్ మూవీని తెరకెక్కించిన డైరెక్టర్ ఆనంద కృష్ణన్ తెరకెక్కిస్తోన్న చిత్రం 'విజయ రాఘవన్'. ఇన్ఫినిటీ ఫిల్మ్ వెంచర్ సమర్పణలో చెందూర్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై టి.డి.రాజా, డి.ఆర్.సంజయ్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.ఈ చిత్రాన్ని మే 14న విడుదల చేస్తున్నట్లు నిర్మాతలు తెలిపారు. ఈ సందర్భంగా...
విజయ్ ఆంటోని మాట్లాడుతూ ‘‘రీసెంట్‌గా విడుదలైన ఈ సినిమా పాటలకు, ట్రైలర్‌కు ట్రెమెండస్ రెస్పాన్స్ వచ్చింది. ఓ మాస్ ఏరియాలో పిల్లలు పక్క దారులు పట్టకుండా ... చదువు గొప్పతనాన్ని వారికి వివరించి, వారి ఉన్నతికి పాటు పడే యువకుడి కథే విజయ్ రాఘవన్. ప్రస్తుత ట్రెండ్‌కు అనుగుణంగా తెరకెక్కిస్తున్నాం. డిఫరెంట్ పాత్ర. కచ్చితంగా తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగినట్లుగా సినిమా ఉంటుంది. డైరెక్టర్ ఆనంద కృష్ణన్ సినిమాను అద్భుతంగా అన్ని ఎలిమెంట్స్‌ను కవర్ చేస్తూ తెరకెక్కించారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరగుతున్నాయి. తెలుగు, తమిళ భాషల్లో మే 14న విడుదల చేస్తున్నాం’’ అన్నారు.
విజయ్ ఆంటోని, ఆత్మిక, రామచంద్రరాజు, ప్రభాకర్ తదితరులు నటిస్తోన్న ఈ చిత్రానికి మ్యూజిక్: నివాస్ కె.ప్రసన్న, సినిమాటోగ్రఫీ: ఎన్.ఎస్.ఉదయ్‌కుమార్, ఎడిటర్: లియో జాన్ పాల్, సహ నిర్మాతలు: కమల్ బోరా, లలిత ధనంజయన్, బి.ప్రదీప్, పంకజ్ బోరా, ఎస్.విక్రమ్ కుమార్, నిర్మాతలు: టి.డి.రాజా, డి.ఆర్. సంజయ్ కుమార్, రచన, దర్శకత్వం: ఆనంద కృష్ణన్.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com