'రోషగాడు' తో సందేశాన్ని ఇవ్వనున్న విజయ్ ఆంటోని
Send us your feedback to audioarticles@vaarta.com
పోలీస్ కథల నేపథ్యంలో సాగిన సినిమాలకి విజయాల శాతం ఎక్కువ. పోలీస్ పాత్రను చేసి విజయం అందుకోని కథానాయకుడు లేరంటే అతిశయోక్తి కాదు. అందుకే ఇప్పుడు ఈ పాత్రలో నటించేందుకు సిద్ధమవుతున్నారు తమిళ నటుడు విజయ్ ఆంటోనీ. తిమిరు పుడిచివన్` చిత్రంతో ఆయన మొదటి సారిగా పోలీస్ పాత్రలో దర్శనమివ్వబోతున్నారు. తెలుగులో రోషగాడు` పేరుతో ఈ చిత్రాన్ని అనువదించబోతున్నారు. రాజమౌళి దగ్గర సహాయకుడిగా పనిచేసిన గణేశా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ వారంలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.
ఈ సందర్భంగా దర్శకుడు సినిమా గురించి మాట్లాడుతూ “ టీనేజ్..చాలా కీలకమైన వయసు. ఈ వయసులో పిల్లలకి సరైన మార్గదర్శకత్వం కావాలి. ఈ వయసులో ఉన్న పిల్లల్ని తల్లిదండ్రులు సరైన మార్గంలో పెడితే...వారు కలల్ని సాకారం చేసుకుని ఉత్తమ పౌరులుగా సంఘంలో ఎదుగుతారు” అనే సందేశాన్ని విజయ్ ఆంటోనీ పాత్ర ద్వారా ఇవ్వబోతున్నామని తెలిపారు. విజయ్ ఆంటోనీ గురించి ఆయన మాట్లాడుతూ “పోలీస్ ఆఫీసర్స్ బాడీ లాంగ్వేజ్, వారి మనస్తత్వం ఎలా ఉంటుందో ..నిజజీవితంలో కొంతమంది పోలీస్ ఆఫీసర్లను చూసి ఆయన నేర్చుకుంటున్నారు” అని తెలిపారు. ఈ సినిమాకి రిచర్డ్ నాథన్ సినిమాటోగ్రాఫర్ కాగా...విజయ్ ఆంటోనీ సంగీతం అందించనున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments