విజయ్ ఆంటోని స్ట్రయిట్ తెలుగు మూవీ ప్రారంభం
Send us your feedback to audioarticles@vaarta.com
విజయ్ ఆంటోనీ, అరుణ్ విజయ్ హీరోలుగా 'అర్జున్ రెడ్డి' ఫేమ్ షాలిని పాండే హీరోయిన్ గా నవీన్ ఎం. దర్శకత్వంలో అమ్మ క్రియేషన్స్ బ్యానర్ పై సర్వన్త్ రామ్ క్రియేషన్స్ రామాంజనేయులు సమర్పణలో టి. శివ నిర్మిస్తోన్న చిత్రం 'జ్వాలా'. ఈ చిత్రం నిన్న హైదరాబాద్ లో ఫిలిం నగర్ దైవ సన్నిధానంలో పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది.
విజయ్ ఆంటోనీ, అరుణ్ విజయ్, షాలిని పాండే లపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ హీరో సందీప్ కిషన్ క్లాప్ నిచ్చారు. ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రం తెలుగు, తమిళ్ భాషల్లో బైలాంగ్వేల్ చిత్రంగా నిర్మిస్తున్నారు. అనంతరం ఏర్పాటైన సమావేశంలో హీరోలు విజయ్ ఆంటోనీ, అరుణ్ విజయ్, నాజర్, షాలిని పాండే, నవీన్ ఎం, కెమెరామెన్ అహ్మద్ బచ్చా కమల్, కో-ప్రొడ్యూసర్ రామాంజనేయులు, నిర్మాత టి. శివ పాల్గొన్నారు.
సహ నిర్మాత రామాంజనేయులు మాట్లాడుతూ .. కంప్లీట్ యాక్షన్ ఎంటర్ టైనర్ చిత్రమిది. విజయ్ ఆంటోనీ గారి ఫస్ట్ సినిమాని తెలుగులో 'నకిలీ' పేరుతో నేనే డబ్ చేశాను. అప్పుడే విజయ్ ఆంటోనీ తెలుగులో మంచి హీరో అవుతాడని అనిపంచింది. విజయ్ ఆంటోనీ, అరుణ్ విజయ్ పాత్రలు పోటా పోటీగా ఉంటాయి. షాలిని క్యారెక్టర్ వసంత కోకిల చిత్రంలో శ్రేదేవి తరహా పాత్ర. ఛాలెంజింగా ఉంటుంది.. అన్నారు.
నిర్మాత టి. శివ మాట్లాడుతూ.. అమ్మా క్రియేషన్స్ బ్యానర్లో ఇప్పటివరకు 23 చిత్రాలు తమిళ్ లో నిర్మించాను. తొలిసారి జ్వాలా చిత్రాన్ని తెలుగు తమిళ్ లో బైలాంగ్విల్ ఫిలిం గా నిర్మిస్తున్నాం. ఫుల్ యాక్షన్ అండ్ ఎమోషనల్ ఎంటర్ టైనర్ చిత్రం. జగపతి బాబు, ప్రకాష్ రాజ్, నాజర్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. జనవరి 3నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తాం. కలకొత్తా, గోవా, యూరప్, చెన్నయ్ వంటి సుందరమైన ప్రదేశాలలో షూటింగ్ జరుపుతాం. ఈ సినిమాని నిర్మించటం చాలా గర్వంగా వుంది.. అన్నారు.
హీరో విజయ్ ఆంటోనీ మాట్లాడుతూ.. ఇప్పటి వరకు నేను చేసిన 9 చిత్రాలు తెలుగులో డబ్ అయి మంచి విజయాలు సాధించాయి. నవీన్ హైలీ టాలెంటెడ్ డైరెక్టర్. స్క్రిప్ట్ చాలా ఎక్సయిటింగ్ గా అనిపించింది. నా కేరిర్ లోనే హైయ్యెస్ట్ బడ్జెట్ చిత్రమిది. హాలీవుడ్ స్టాండర్డ్స్ లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అన్నారు.
అరుణ్ విజయ్ మాట్లాడుతూ.. తెలుగులో చేస్తున్న మూడవ చిత్రం. జ్వాలా కథ వినగానే చాలా ఎక్సయిటింగ్ గా అనిపించింది. నవీన్ ప్రతిభగల దర్శకుడు. శివ గారు వెరీ హంబుల్ పర్సన్. బిగ్ పాడింగ్ తో ఖర్చుకి వెనకాడకుండా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.. అన్నారు.
దర్శకుడు నవీన్ ఎం. మాట్లాడుతూ.. ఇది నా స్ట్రైట్ తెలుగు చిత్రం. బైలాంగ్విల్ సినిమాగా జ్వాలా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. శివ గారు కథపై వున్నా నమ్మకంతో ఈ చిత్రాన్ని కాంప్రమైజ్ కాకుండా నిర్మిస్తున్నారు. ఆయనకి థాంక్స్. కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రమిది. అందరికి నచ్చే విధంగా ఉంటుంది అన్నారు.
హెరాయిన్ షాలిని పాండే మాట్లాడుతూ.. అర్జున్ రెడ్డి తరువాత చాలా ఆఫర్స్ వచ్చాయి. కానీ ఏది అంతగా నచ్చలేదు. నవీన్ చెప్పిన జ్వాలా కథ బాగా నచ్చింది. నా క్యారెక్టర్ చాలెంజింగ్ గా ఉంటుంది.. అన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Bala Vignesh
Contact at support@indiaglitz.com