'రోషగాడు' మోషన్ పోస్టర్ విడుదల
Send us your feedback to audioarticles@vaarta.com
విజయ్ ఆంథోని నటిస్తొన్న తాజా చిత్రం "రోషగాడు". ఈ వైవిధ్యమైన హీరో తొలిసారి పవర్ ఫుల్ పొలీసాఫీసర్ పాత్రలో నటిస్తొన్న ఈ చిత్రానికి గణేష దర్శకుడు. విజయ్ ఆంథోని ఫిలిం కార్పొరేషన్ పతాకంపై ఫాతిమా విజయ్ ఆంథోని నిర్మిస్తొన్న ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ మోషన్ పొస్టర్ ను ఈ రోజు విడుదల చెశారు.
"వళ్లంతా పొగరురా పొగరుకె మొగుడురా మొగుడురా పొగరుకే పడడు మాట రోషగాడు రా.." అంటూ భాష్య శ్రీ రాసిన పవర్ ఫుల్ థీమ్ లిరిక్ తో ఆద్యంతం ఆకట్టుకునెలా రోషగాడు మోషన్ పొస్టర్ ను విడుదల చెశారు. విజయ్ ఆంథోని సరసన నివేథా పేతురాజ్ హీరొయిన్ గా నటిస్తుండగా , నటుడు దీనా ఓ ప్రముఖ పాత్రలో అలరించనున్నారు. కంటెంట్ కు ప్రాధాన్యత నిస్తూ, పక్కా కమర్షియల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతోన్న "రోషగాడు" త్వరలొనె ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ చిత్రానికి మాటలు-పాటలు: భాష్య శ్రీ సంగీతం: విజయ్ ఆంథోని నిర్మాణం:విజయ్ ఆంటోని ఫిలిం కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ , నిర్మాత :ఫాతిమా విజయ్ ఆంటోని. కథ-దర్శకత్వం గణేష ,
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com