లేటెస్ట్‌ మూవీ లుక్‌ విడుదల చేసిన విజయ్‌ ఆంటోని

  • IndiaGlitz, [Friday,November 13 2020]

'నకిలీ, డా.సలీమ్‌, బిచ్చగాడు, భేతాళుడు, ఇంద్రసేన, రోషగాడు, కిల్లర్‌' వంటి చిత్రాలతో టాలీవుడ్‌లో తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సంపాదించుకున్న హీరో విజయ్‌ ఆంటోని. ఈయన హీరోగా.. 'మెట్రో' వంటి డిఫరెంట్‌ మూవీని తెరకెక్కించిన డైరెక్టర్‌ ఆనంద కృష్ణన్‌ తెరకెక్కిస్తోన్న చిత్రం 'కోడియిల్‌ ఒరువన్‌(కోటికొక్కడు)'. ఈ చిత్రాన్ని తెలుగులో 'విజయ రాఘవన్‌'గా విడుదల చేస్తున్నారు. ఇన్ఫినిటీ ఫిల్మ్‌ వెంచర్‌ సమర్పణలో చెందూర్ ఫిల్మ్‌ ఇంటర్నేషనల్‌ బ్యానర్‌పై టి.డి.రాజా, డి.ఆర్‌.సంజయ్‌ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దీపావళి సందర్భంగా ఈ సినిమా టైటిల్‌ అనౌన్స్‌మెంట్‌తో పాటు ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. ఎత్తైన భవనాల సముదాయంపై స్టైల్‌గా కాలుపై కాలు వేసుకుని కూర్చున్న విజయ్‌ ఆంటోని ఫొటోను ఫస్ట్‌లుక్‌గా చిత్ర యూనిట్‌ విడుదల చేసింది. చాలా ఇన్‌టెన్స్‌ లుక్‌తో విజయ్‌ ఆంటోని ఆకట్టుకుంటున్నారు. ప్రస్తుతం చిత్రీకరణను జరుపుకుంటోన్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది వేసవిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

నివాస్‌ కె.ప్రసన్న సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి ఉదయ కుమార్‌ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. మరోవైపు విజయ్ ఆంటోని జ్వాల సినిమా షూటింగ్‌ పూర్తి చేసుకుంది. అలాగే బిచ్చగాడు 2 ప్రీ ప్రొడక్షన్‌ పనులను పూర్తి చేసుకుంటోంది.

More News

ప్రేమ పెళ్లికి సిద్ధమవుతున్న ప్రభుదేవా!

ప్రముఖ కొరియోగ్రాఫర్, దర్శకుడు ప్రభుదేవా మరోసారి ప్రేమలో పడినట్టు తెలుస్తోంది. ఇప్పటికే వివాహమై ప్రభుదేవాకు పిల్లలున్నారు.

క్రాకర్స్‌ను బ్యాన్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు

క్రాకర్స్‌ను బ్యాన్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

సింగిల్ హ్యాండ్‌తో చుక్కలు చూపించారు.. కానీ సీఎం సీట్ జస్ట్ మిస్..

ఇటీవల జరిగిన బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి విజయం సాధించింది. అయితే ఆర్‌జేడీ అధినేత, మహాకూటమి సారథి తేజస్వి యాదవ్‌ ఎన్డీఏ కూటమికి గట్టి పోటీ ఇచ్చారు.

అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పిన చిరు

మెగాస్టార్ చిరంజీవికి కరోనా పాజిటివ్ అన్న విషయం ఆయన అభిమానులను దిగ్భ్రాంతికి గురి చేసిన విషయం తెలిసిందే. అయితే అభిమానులకు నేడు చిరు గుడ్ న్యూస్ చెప్పారు. నిజానికి ఆయనకు కరోనా సోకలేదని..

జీహెచ్ఎంసీ ఎన్నికలకు డేట్ ఫిక్స్!

జీహెచ్ఎంసీ ఎన్నికలను అధికార టీఆర్ఎస్ పార్టీ వీలైనంత త్వరగా నిర్వహించాలని భావిస్తోంది. మరో మూడు రోజుల్లో అంటే దీపావళి మరుసటి రోజే నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశాలు కూడా పుష్కలంగా కనిపిస్తున్నాయి.