విజయ్ ఆంటోని కొత్త సినిమా అప్ డేట్
Send us your feedback to audioarticles@vaarta.com
విజయ్ ఆంటోని తెలుగులో మంచి సక్సెస్ కోసం చకోర పక్షిలా ఎదురు చూస్తున్నాడు. 'బిచ్చగాడు'తో తెలుగులో సెన్సేషనల్ హిట్ అందుకున్నవిజయ్ ఆంటోని తర్వాత ఆ స్థాయి విజయం దక్కలేదు. రీసెంట్‌గా విడుదలైన 'కాశి' చిత్రం కూడా నిరాశనే మిగిల్చింది.
ఇప్పుడు విజయ్ ఆంటోని 'రోషగాడు' సినిమాలో పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తున్నాడు. కాగా ఇప్పుడు 'కొలైకారన్' (హంతకుడు అనే అర్థం) సినిమా చేయబోతున్నాడు. అండ్రూ లూయిస్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో అర్జున్ కీలకపాత్రలో నటిస్తుండటం విశేషం.
విజయ్ ఆంటోని, అర్జున్ పాత్రలు పోటాపోటీగా ఉంటాయి. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. రేపటి నుండి సినిమా షూటింగ్ ప్రారంభం అవుతుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com