పిక్చర్ బాక్స్ ద్వారా తెలుగులో విడుదల కానున్న విజయ్ ఆంటోని 'కాశి'
Send us your feedback to audioarticles@vaarta.com
బిచ్చగాడు లాంటి బ్లాక్‌బస్టర్ చిత్రం తరువాత తెలుగు ప్రేక్షకుల మనసుకు బాగా దగ్గరైన విజయ్ ఆంటోని హీరోగా, తెలుగు హీరోయిన్ గా సౌత్ఇండియాలో ప్రత్యేకమైన క్రేజ్ ని సొంతం చేసుకున్న అంజలి హీరోయిన్ గా, క్రితిక ఉదయనిధి దర్శకత్వంలో తమిళ, తెలుగు భాషల్లో రూపొందుతున్న చిత్రం కాలి. మరో హీరోయిన్ గా సునయన నటిస్తున్నారు. ఈ చిత్రం తెలుగు రైట్స్ ని ప్రముఖ నిర్మాణ సంస్థ పిక్చర్ బాక్స్ కంపెనీ అధినేత విలియమ్ అలెగ్జాండర్ సొంతం చేసుకున్నారు. తెలుగు వెర్షన్ కి కాశి అనే టైటిల్ ని ఖరారు చేశారు. అతిత్వరలో కాశి చిత్రానికి సంబంధించిన అన్ని వివరాలు తెలియజేస్తారు. ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో విడుదల చేయటానికి నిర్మాతలు సన్నాహలు చేస్తున్నారు.
బిచ్చగాడు లాంటి బ్లాక్‌బస్టర్ చిత్రం తరువాత విజయ్ ఆంటోని కి తెలుగులో చాలా మంచి క్రేజ్ వచ్చింది. ట్రేడ్ లో బిజినెస్ క్రేజ్ కూడా బాగా పెరిగింది. విజయ్ ఆంటోని సినిమా అంటే ఓపెనింగ్స్ వస్తున్నాయంటే ఆయన చేస్తున్న చిత్రాలు కాన్సెప్ట్ లు అంతలా ఎట్రాక్ట్ చేస్తున్నాయి. ఆయన హీరోగా తమిళ, తెలుగు భాషల్లో నిర్మిస్తున్న చిత్రం కాలి ని తెలుగులో కాశి గా విడుదల చేస్తున్నారు. ఈ చిత్రాన్ని పిక్చర్ బాక్స్ కంపెని బ్యానర్ లో త్వరలో తెలుగు ప్రేక్షకులకి అందిస్తున్నారు. బిచ్చగాడు చిత్రం తరువాత మదర్ సెంటిమెంట్ లో మరో క
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com