విజ‌య్ ఆంటోని 'జ్వాల‌' ప్రారంభం

  • IndiaGlitz, [Saturday,December 22 2018]

అమ్మా క్రియేష‌న్స్ ప‌తాకంపై విజ‌య్ ఆంటోని, అరుణ్ విజ‌య్‌, షాలిని పాండే హీరో హీరోయిన్లుగా కొత్త చిత్రం జ్వాల శుక్ర‌వారం లాంఛ‌నంగా ప్రారంభ‌మైంది. విజ‌య్ ఆంటోని తెలుగులో న‌టిస్తున్న స్ట్ర‌యిట్ మూవీ ఇది. అరుణ్ విజ‌య్ మ‌రో హీరోగా న‌టిస్తున్నారు. అర్జున్ రెడ్డి ఫేమ్ షాలిని పాండే ఇందులో హీరోయిన్‌గా నటిస్తుంది. న‌వీన్‌.ఎం ద‌ర్శ‌కుడు. టి.శివ నిర్మాత‌. శుక్ర‌వారం ఈ సినిమా లాంఛ‌నంగా ప్రారంభ‌మైంది. ఈ సంద‌ర్భంగా...
 
నిర్మాత టి.శివ మాట్లాడుతూ - ''ద‌ర్శ‌కుడు న‌వీన్ చెప్పిన స్క్రిప్ట్ బాగా న‌చ్చింది. జ‌న‌వ‌రి 3 నుండి రెగ్యుల‌ర్ షూటింగ్ జ‌రుపుకోనుంది. కోల్‌క‌తా, గోవా, యూర‌ప్ ప్రాంతాల్లో సినిమాను చిత్రీక‌రించ‌నున్నారు. ఔట్ అండ్ ఔట్ యాక్ష‌న్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే చిత్ర‌మిది. హాలీవుడ్ అహ్మ‌ద్ బ‌ట్చా క‌మ‌ల్ బ‌ట్చా సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు'' అన్నారు.
 
చిత్ర స‌మ‌ర్ప‌కుడు రామాంజ‌నేయులు మాట్లాడుతూ.. విజ‌య్ ఆంటోని మెద‌టి తెలుగు డ‌బ్బింగ్ చిత్రం న‌కిలి రిలీజ్ చేశాం.. ఇప్ప‌డు డైరక్ట్ తెలుగు సినిమా చేసే అవ‌కాశం వ‌చ్చినందుకు ఆనందంగా వుంది. అలాగే యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ గా తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో అర్జున్‌రెడ్డి ఫేం షాలిని పాండే , అరుణ్ విజ‌య్ లు జంట‌గా చేస్తున్నారు. జ‌న‌వ‌రి మెద‌టివారంలో చిత్రం సెట్స్ మీద‌కి వెళ్ళ‌నుంది. యూర‌ప్‌, క‌ల‌క‌త్తా బ్యాక్‌డ్రాప్ లో చిత్ర షూటింగ్ జ‌రుపుకుంటుంది. అని అన్నారు.
 
హీరో విజ‌య్ ఆంటోని మాట్లాడుతూ - ''న‌వీన్ స్క్రిప్ట్ చెప్ప‌గానే న‌చ్చేసింది. మంచి టాలెంటెడ్ ప‌ర్స‌న్‌. ఇప్ప‌టి వ‌ర‌కు నేను న‌టించిన అనువాద చిత్రాల‌ను తెలుగు ప్రేక్ష‌కులు ఆద‌రించారు. తొలిసారి తెలుగులో చేస్తున్న స్ట్ర‌యిట్ మూవీ. బ్యూటీఫుల్ స్క్రిప్ట్‌. నాకెరీర్‌లో వ‌న్ ఆఫ్ ది బెస్ట్ మూవీ అవుతుంద‌ని చెప్ప‌గ‌ల‌ను. నాతో పాటు అరుణ్ విజ‌య్‌, షాలిని పాండేలు కూడా న‌టిస్తున్నారు. అంద‌రికీ ఛాలెజింగ్ మూవీ. హాలీవుడ్ స్టాండ‌ర్డ్స్‌లో ఉంటుంద‌ని భావిస్తున్నాను. అలాగే ప్రకాశ్‌రాజ్‌గారు, జ‌గ‌ప‌తిబాబుగారు కీల‌క‌పాత్ర‌ల్లోన‌టిస్తున్నారు. వారికి కూడా నా థాంక్స్‌'' అన్నారు.
 
హీరో అరుణ్ విజ‌య్ మాట్లాడుతూ - ''చాలా ఎగ్జ‌యిటెడ్‌గా ఉంది. బ్రూస్‌లీ, సాహో త‌ర్వాత తెలుగులో నేను చేస్తున్న మూడో స్ట్ర‌యిట్ మూవీ ఇది. నాకు యాక్ష‌న్ సినిమాలంటే ఇష్టం. అలాంటి ఔట్ అండ్ ఔట్ యాక్ష‌న్ మూవీలో న‌టిస్తుండ‌టం ఆనందంగా ఉంది. విజ‌య్ ఆంటోనిగారితో, షాలిని పాండేతో క‌లిసి న‌టిస్తుండం హ్యాపీగా ఉంది'' అన్నారు.
 
షాలిని పాండే మాట్లాడుతూ - ''స్క్రిప్ట్ విన‌గానే చాలా బాగా న‌చ్చింది. ఎగ్జ‌యిటెడ్‌గా వెయిట్ చేస్తున్నాను'' అన్నారు.