చిరంజీవి టైటిల్స్‌పైనే క‌న్నేశాడే!

  • IndiaGlitz, [Saturday,December 22 2018]

న‌కిలీ, డా.స‌లీమ్ చిత్రాల స‌క్సెస్‌ల‌తో ప‌రావాలేదు అనిపించుకున్న విజ‌య్ ఆంటోని బిచ్చ‌గాడుతో మాత్రం సెన్సేష‌న‌ల్ హిట్‌ను సొంతం చేసుకున్నాడు. త‌ర్వాత విడుద‌లైన బేతాళుడు, య‌మ‌న్ నుండి రీసెంట్‌గా వచ్చిన రోషగాడు వ‌ర‌కు సినిమాలేవీ బాక్సాఫీస్ వ‌ద్ద స‌క్సెస్ కాలేదు.

అనువాద చిత్రాల‌కే ప‌రిమితం అయిన విజ‌య్ ఆంటోని న‌వీన్ అనే డెబ్యూ డైరెక్ట‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో స్ట్ర‌యిట్ తెలుగు సినిమాలో న‌టించ‌బోతున్నాడు. ఇందులో షాలిని పాండే విజ‌య్ ఆంటోని సిస్ట‌ర్ పాత్ర‌లో న‌టిస్తుంది. అరుణ్ విజ‌య్ మ‌రో హీరోగా న‌టిస్తున్నాడు. ఔట్ అండ్ ఔట్ యాక్ష‌న్ చిత్రంగా తెర‌కెక్కబోతున్న ఈ సినిమాకు 'జ్వాల‌' అనే టైటిల్‌ను ఖ‌రారు. విజ‌య్ ఆంటోని వ‌రస చూస్తుంటే చిరంజీవి టైటిల్స్‌పైనే క‌న్నేసిన‌ట్లు క‌న‌ప‌డుతుంది.

ఇంత‌కుముందు ఇంద్ర‌సేన ..రీసెంట్‌గా రోషగాడు టైటిల్స్ పెట్టుకున్నాడు. తాజాగా జ్వాల అనే టైటిల్ పెట్టాడు. అయితే పై రెండు సినిమాలు విజ‌య్ ఆంటోనికి స‌క్సెస్‌ను ఇవ్వ‌లేదు. మ‌రిప్పుడు జ్వాల ఎలాంటి స‌క్సెస్‌ను ఇస్తుందో చూడాలి.