డిసెంబర్ 1న విజయ్ ఆంటోని 'బేతాళుడు' విడుదల

  • IndiaGlitz, [Monday,November 21 2016]

విజయ్ ఆంటోని' కధానాయకునిగా తమిళంలో రూపొందుతున్న 'సైతాన్' చిత్రం తెలుగు నాట 'బేతాళుడు' గా డిసెంబర్ 1 పలకరించబోతోంది.
తెలుగు,తమిళంలో చిత్రం డిసెంబర్ 1 న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సన్నాహాలు జరుగుతున్నాయి అని తెలిపారు నిర్మాత ఎస్.వేణుగోపాల్. 'మానస్ రిషి ఎంటర్ ప్రైజస్' సంస్థ తో కలసి ఈ 'బేతాళుడు' చిత్రాన్నితెలుగునాట తమ 'విన్.విన్.విన్. క్రియేషన్స్' సంస్థ విడుదల చేయనుందని నిర్మాత ఎస్.వేణుగోపాల్ తెలిపారు.
పదినిమిషాల "బేతాళుడు" వీడియో కు ప్రపంచ వ్యాప్తంగా విశేష స్పందన ఇటీవల యూ ట్యూబ్ లో బేతాళుడు చిత్రానికి సంబంధించి మొదటి 10 నిమిషాల చిత్రాన్ని విడుదల చేయటం జరిగింది. తెలుగు,తమిళ భాషల్లో ఇలా విడుదల చేయగా ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన స్పందన చిత్రం విజయం పై మానమ్మకాన్ని మరింత పెంచాయని తెలిపారు చిత్ర నిర్మాతలు. అలాగే ఇటీవల విడుదల అయిన చిత్రం ఆడియో కు మంచి స్పందన లభించిందని అన్నారు.
చిత్ర కథానాయకుడు 'విజయ్ ఆంటోని' మాట్లాడుతూ..' నటునిగా వైవిధ్యమైన పాత్రల పోషణ లక్ష్యం గా ఉన్న నాకు కొనసాగింపు ఈ 'బేతాళుడు'. 'సైకలాజికల్ సస్పెన్స్ థ్రిల్లర్' ఈ చిత్రం. సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా ఈ చిత్రంలో నా పాత్ర గత చిత్రాలకు పూర్తి భిన్నమైనదిగా ఉండటంతో పాటు, వైవిధ్యాన్ని సంతరించుకుని ఉంటుంది.చిత్ర దర్శకుడు 'ప్రదీప్ కుమార్' ఈ చిత్రం ప్రేక్షకులను పూర్తిస్థాయిలో అలరించేలా తీర్చి దిద్దారని నమ్ముతున్నాను. 'ప్రదీప్ కలపురయల్' సినిమాటోగ్రఫీ ఓ ఎస్సెట్ ఈ చిత్రానికి. 'బేతాళుడు' కు సంగీతం నేనే. పాటలు,నేపధ్య సంగీతం సంగీత ప్రియులను అలరించటం ఎంతో ఆనందంగా ఉంది అన్నారు.
ఇటీవల యూ ట్యూబ్ లో ఉంచిన తొలి 10 నిమిషాల చిత్రానికి వచ్చిన స్పదన ఎంతో సంతోషా న్నిచ్చిందని తెలిపారు విజయ్ ఆంటోని. 'బిచ్చగాడు' విజయం తరువాత విడుదల అవుతున్న'బేతాళుడు' చిత్రం పై సహజంగా అంచనాలు అధికంగానే ఉంటాయి. వాటికి తగిన స్థాయిలోనే ఈ చిత్రం ఉంటుందని తెలిపారు చిత్ర కథానాయకుడు విజయ్ ఆంటోని

More News

బన్ని హీరోయిన్ ఫిక్సయ్యింది...

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్,తమిళ దర్శకుడు లింగుస్వామి కాంబినేషన్ లో సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే.

చరణ్ సిక్స్ ప్యాక్....

బన్ని,ఎన్టీఆర్,కల్యాణ్ రామ్ ఇలా యంగ్ జనరేషన్ హీరోలందరూ సిక్స్ ప్యాక్ తో అభిమానులను ఆకట్టుకున్నారు.

సూర్య సింగం 3 ఆడియో రిలీజ్ డేట్..!

సూర్య హీరోగా న‌టిస్తున్న‌తాజా చిత్రం సింగం 3. సింగం సిరీస్ లో మూడో సినిమాగా వ‌స్తున్న సింగం 3 పై అటు త‌మిళ్, ఇటు తెలుగులో ఊహించిన‌ట్టుగానే క్రేజ్ ఏర్ప‌డింది.

సీనియ‌ర్ న‌రేష్ కొత్త అవ‌తారం..!

హాస్య‌ల చిత్రాల క‌థానాయ‌కుడుగా...ఎన్నో విభిన్నమైన పాత్ర‌ల్లో న‌టించి త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక‌త ఏర్ప‌రుచుకున్న సీనియ‌ర్ న‌టుడు న‌రేష్. క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ గా సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి ఇటీవ‌ల దృశ్యం, భ‌లే భ‌లే మ‌గాడివోయ్, నేను శైల‌జ‌, అఆ త‌దిత‌ర చిత్రాల్లో న‌టించి ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకున్నారు.

'2.0' లో యాక్ట్ చేయడం వల్ల ఓపిక పెరిగింది: అక్షయ్ కుమార్

స్టార్ డైరెక్టర్ శంకర్ బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ ను నెగటివ్ హీరోను చేసేశాడు.