5న విజయ్ ఆంటోని బేతాళుడు ఆడియో రిలీజ్..!
Thursday, November 3, 2016 తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
విజయ్ ఆంటోని, అరుంధతి నాయర్ జంటగా నటించిన తమిళ చిత్రం సైతాన్. సైకలాజికల్ సస్పెన్స్ థ్రిల్లర్ గా రూపొందిన సైతాన్ చిత్రాన్ని తెలుగులో బేతాళుడు టైటిల్ తో అనువదిస్తున్నారు. మానస్ రిషి ఎంటర్ ప్రైజస్ సంస్థ తో కలసి ఈ బేతాళుడు చిత్రాన్నితెలుగునాట తమ 'విన్.విన్.విన్. క్రియేషన్స్' సంస్థ విడుదల చేయనుందని నిర్మాత ఎస్.వేణుగోపాల్ తెలిపారు. ఈ చిత్రంలో విజయ్ ఆంటోని గత చిత్రాలకు భిన్నంగా సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా నటించారు.
డైరెక్టర్ 'ప్రదీప్ కలపురయల్' సినిమాటోగ్రఫీ ఈ చిత్రానికి ఓ ఎస్సెట్. బిచ్చగాడు విజయం తరువాత విడుదల అవుతున్న సైతాన్ చిత్రం పై సహజంగా అంచనాలు అధికంగానే ఉంటాయి. వాటికి తగిన స్థాయిలోనే ఈ చిత్రం ఉంటుందని తెలిపారు చిత్ర కథానాయకుడు విజయ్ ఆంటోని. ఇదిలా ఉంటే.. బేతాళుడు ఆడియోను ఈనెల 6న రిలీజ్ చేయాలి అనుకున్నారు కానీ..ఒక రో్జు ముందుగా ఈనెల 5న హైదరాబాద్ సినీమ్యాక్స్ లో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments