పవర్ ఫుల్ పోలీసు పాత్రలో విజయ్ ఆంటోని

  • IndiaGlitz, [Tuesday,July 24 2018]

నకిలి, డాక్టర్ సలీమ్, బిచ్చగాడు, బేతాళుడు, యమన్, ఇంద్రసేన, కాశీ తదితర చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు విజయ్ అంటోని. మ్యూజిక్ డైరెక్టర్ గా పరిచయమైన విజయ్ ఆంటోని... ఆ తరువాత హీరోగా తెలుగులో డాక్టర్ సలీంతో మంచి పేరు తెచ్చుకున్నాడు. ఆ తరువాత విడుదలైన బిచ్చగాడు సినిమాతో అటు తమిళ ఇండస్ట్రీతో పాటు... ఇటు తెలుగులోనూ మంచి మార్కెట్టును క్రియేట్ చేసుకున్నాడు.

అందుకే ఇటీవల అతని ప్రతి సినిమా... తమిళంతో పాటు.. తెలుగులోనూ రిలీజ్ చేయడానికి డిస్ట్రిబ్యూటర్లు ఆసక్తి చూపుతున్నారు. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న విజయ్ ఆంటోనీ...తాజాగా ఓ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతుడున్నాడు. తమిళంలో తిమిరుపుడిచ్చవన్(Thimirupudichavan) అనే టైటిల్ ను కన్ ఫర్మ్ చేశారు.

ఇటీవలే మోషన్ పోస్టర్ ను కూడా విడుదల చేయగా... రికార్డు స్థాయిలో డిజిటల్ వ్యూస్ వచ్చాయి. త్వరలోనే తెలుగు టైటిల్ ను కూడా ఖరారు చేయనున్నారు. ఈ చిత్రం తర్వలోనే పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రాన్ని విజయ్ ఆంటోని తన సొంత బ్యానర్ విజయ్ ఆంటోని ఫిలిం కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై నిర్మిస్తున్నారు. నిర్మాత ఫాతిమా విజయ్ ఆంటోని. తనే ఈ చిత్రానికి సంగీతం వహిస్తుండగా... అతని సరసన నివేథా పేతురాజ్ (మెంటల్ మదిలో ఫేం) హీరోయిన్ గా నటిస్తోంది. డేనియల్ బాలాజీ ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడు. రచన-దర్శకత్వం గణేష.

More News

అరుణ్ ఆదిత్ 'జిగేల్' తొలి షెడ్యూల్ పూర్తి

అరుణ్ ఆదిత్ నటిస్తున్న తాజా చిత్రం 'జిగేల్'. శ్రీ ఇందిరా కంబైన్స్ పతాకంపై అల్లం నాగార్జున నిర్మాణ సారధ్యంలో నిర్మాణమవుతున్న ఈ చిత్రం తొలి షెడ్యూల్ పూర్తయింది.

'వీరభోగ వసంత రాయలు' లో నారా రోహిత్ లుక్..

నారా రోహిత్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ' వీర భోగ వసంత రాయలు'.. రేపు నారా రోహిత్ బర్త్ డే సందర్భంగా అయన ఫస్ట్ లుక్ ను ఈరోజు రిలీజ్ చేసింది చిత్ర బృందం..

బెక్కెం వేణుగోపాల్ నిర్మిస్తున్న 9వ చిత్రం 'హుషారు'

'టాటా బిర్లా మధ్యలో లైలా' చిత్రంతో నిర్మాతగా తన ప్రస్థానం ప్రారంభించిన లక్కీ మీడియా సంస్థ అధినేత బెక్కెం  వేణుగోపాల్ ' మేము వయసుకు వచ్చాం', ' సినిమా చూపిస్త మావ' లాంటి సూపర్ హిట్లు తీశారు.

రిపీట్ చేస్తున్న క్రిష్‌...

డైరెక్ట‌ర్ జాగ‌ర్ల‌మూడి క్రిష్ ప్లానింగ్ ప్రకారం చేస్తున్నాడో.. లేక యాదృచ్చికంగా జ‌రుగుతుందో ఏమోకానీ.. ఓ విష‌యాన్ని రిపీట్ చేస్తున్నాడు.

బాలీవుడ్‌లోకి అమ‌లాపాల్‌

నీలి తామ‌ర అనే మ‌ల‌యాళ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన అమ‌లాపాల్ త‌ర్వాత తెలుగు, త‌మిళ భాష‌ల్లో బిజీ హీరోయిన్‌గా మారింది.