తాగుబోతుగా విజయ్ ఆంటోని?
Send us your feedback to audioarticles@vaarta.com
నకిలీ, డా.సలీం, బిచ్చగాడు, బేతాళుడు, యమన్ చిత్రాలతో తెలుగువారికి దగ్గరైన విజయ్ ఆంటోని.. ప్రస్తుతం ఇంద్రసేనలో నటిస్తున్న సంగతి తెలిసిందే. కొత్త దర్శకుడు శ్రీనివాసన్ రూపొందిస్తున్న ఈ చిత్రాన్ని నటి రాధిక నిర్మిస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో విజయ్ ట్విన్ బ్రదర్స్‌గా కనిపించనున్నారని తమిళనాట వార్తలు వినిపిస్తున్నాయి.
అందులో అన్న పాత్ర ఎప్పుడూ త్రాగుతూ ఉండే టెక్స్‌టైల్ షాప్ ఓనర్ పాత్ర కాగా.. తమ్ముడి పాత్ర బాధ్యత తెలిసిన పీటీ మాస్టర్ పాత్ర అట. ఈ రెండు పాత్రల మధ్య సాగే ఎమోషన్స్ సినిమాకి ప్రధాన బలమని.. ప్రథమార్ధం సరదాగా సాగితే.. ద్వితీయార్థం కన్నీళ్లు తెప్పిస్తుందని ఆ వార్తల సారాంశం. బిచ్చగాడు తరువాత సరైన ఎమోషనల్ సబ్జెక్ట్‌ని ఎంచుకోలేకపోయిన విజయ్ కి ఆ లోటుని తీర్చేలా కనిపిస్తున్న ఇంద్రసేన.. ఈ నవంబర్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com