విజయ్ ఆంటోనీ హీరోగా త్వరలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఎమోషన్ థ్రిల్లర్‌  "విక్రమ్ రాథోడ్"

  • IndiaGlitz, [Friday,December 17 2021]

విజయ్ ఆంటోనీ... తమిళ సినిమాల్లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరో. స్టార్ హీరోలకు మాదిరిగా పేరుకు ముందు పేరు తర్వాత పెద్ద టైటిల్స్ ఏమీ లేనప్పటికీ.. ఆడియెన్స్‌ని ఆలోచింపచేసే విధంగా కథలు ఎంచుకుని సినిమాలు చేయడంలో ముందుండే హీరో అనే పేరు మాత్రం ఉంది. టాలీవుడ్‌లోనూ విజయ్ ఆంటోనీకి మంచి ఫ్యాన్ ఫాలోయింగే ఉంది. బిచ్చగాడు చిత్రం నుంచే విజయ్ ఆంటోనీ చిత్రాలకు మంచి ఆధరణ ఉంది.తాజాగా మరొక డీఫ్రెంట్ కథాంశంతో విక్రమ్ రాథోడ్ గా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. పెప్సి శివ సమర్పణలో విజయ్‌ ఆంటోని కథానాయకుడిగా, రెమిసెస్ హీరోయిన్ గా సురేష్‌ గోపి, సోనూసూద్‌, యోగిబాబు నటీ, నటులుగా తమిళ దర్శకుడు బాబు యోగేశ్వరన్‌ డైరెక్ట్ చేస్తున్న తమిళరసన్ సినిమాను తెలుగులో విక్రమ్ రాథోడ్ అనే టైటిల్‌తో డబ్ అవుతోంది ఈ సినిమాను ఎస్‌.కౌశల్య రాణి నిర్మించిన ఈ చిత్రాన్ని తెలుగులో రావూరి వెంకటస్వామి విడుదల చేస్తున్నారు. ఈనెలలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ సందర్భంగా..

చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ.. ఎమోషన్ థ్రిల్లర్‌ కథాంశంతో తెరకెక్కిన మా విక్రమ్ రాథోడ్ చిత్ర టీజర్‌ కు ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది. మా సినిమాకు గాన గందర్వుడు యస్.పి బాల సుబ్రహ్మణ్యం ఆలపించిన కన్నా..దిగులవకు తొడున్నా..నీ కొరకు అనే పాట హైలెట్ గా నిలుస్తుంది.మరియు జేసుదాస్ కూడా మా చిత్రానికి పాడడం ఎంతో సంతోషంగా ఉంది. మంచి కాన్సెప్టుతో వస్తున్న ఈ చిత్రాన్ని కుటుంబ సమేతంగా చూడవలసిన చిత్రమిది.ఇందులో ఉన్న యాక్షన్‌ సన్నివేశాలు. విజయ్‌.. సోనూసూద్‌ల మధ్య సాగే పోరాట ఘట్టాలు ఆసక్తికరంగా ఉంటాయి.ఈ సినిమాలో సత్యం,న్యాయం, ధర్మం కోసం హీరో పోరాడతాడు. ‘‘కావాలంటే నన్ను ఓ టెర్రరిస్ట్‌ గానో.. ఎక్స్‌ట్రమిస్ట్‌ గానో మీరనుకోండి సర్‌. వాస్తవానికి నాకు సంబంధించి నేనొక కామన్‌మెన్‌’’ అంటూ టీజర్‌లో విజయ్‌ చెప్పిన డైలాగ్‌ ప్రేక్షకులకు ఉత్సుకత కలిగించేలా ఉంది. అన్ని వర్గాల ప్రేక్షకులకు మెచ్చేవిధంగా తెరకెక్కిన మా చిత్రాన్ని ప్రేక్షకుల ఆదరించి ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను అన్నారు.

నటీనటులు: విజయ్‌ ఆంటోని , రెమిసెస్, సురేష్‌ గోపి, సోనూసూద్‌, యోగిబాబు తదితరులు

More News

బిగ్‌బాస్ 5 తెలుగు: సిరిని వెనకనుంచి వాటేసుకున్న షన్నూ.. ఇంత ఓవరాక్టింగ్‌ బ్యాచ్‌ ఏంట్రా అంటూ సన్నీ

బిగ్‌బాస్ 5 తెలుగు ముగింపు దశకు వచ్చింది. ఇప్పటికే కంటెస్టెంట్స్‌ జర్నీలు పూర్తవ్వగా... ఫైనల్‌లో ఎలాగైనా గెలవాలని ఎవరి ప్లాన్లు వారు వేసుకుంటున్నారు.

భీమ్లా నాయక్ : వికారాబాద్‌లో కొత్త షెడ్యూల్.. పవన్‌ను చూసేందుకు ఎగబడ్డ జనం

పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌, దగ్గుబాటి రానా కలిసి నటిస్తున్న చిత్రం ‘భీమ్లానాయక్‌’.

త్రివిక్రమ్ భార్య సౌజన్య నృత్య ప్రదర్శన.. చీఫ్ గెస్ట్‌గా పవన్ కళ్యాణ్

వెండితెరపై రాణిస్తున్న పలువురు నటీనటులు, టెక్నీషీయన్ల జీవిత భాగస్వాములు పలు రంగాల్లో నిష్ణాతులు.

చిత్ర సీమలో మళ్లీ ‘‘కరోనా’’ టెన్షన్...  విక్రమ్‌కు కోవిడ్ పాజిటివ్

భారత్‌లో కరోనా వైరస్ ఎంతోమంది ప్రముఖులను బలి తీసుకుంది. వీరిలో సినీతారలు కూడా వున్నారు.

చెమట, రక్తం చిందించారు... ఫలితం దక్కాలి: పుష్ప టీమ్‌కు మెగాస్టార్ ఆల్‌ ది బెస్ట్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్- సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మూవీ ‘‘పుష్ప’’. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 17న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.