విజయ్ 'అదిరింది' విడుదల తేదీ
Send us your feedback to audioarticles@vaarta.com
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటిస్తున్న 61వ ప్రతిష్టాత్మక చిత్రం అదిరింది. ఈ చిత్రం టీజర్ కు అద్భుతమైన స్పందన లభిస్తోంది. దాదాపు 100 కోట్లతో నిర్మించిన ఈ చిత్రాన్ని తెలుగు తమిళ భాషల్లో గ్రాండ్ గా రిలీస్ చేయనున్నారు. ప్రపంచ ప్రఖ్యాత లీ గ్రాండ్ రెక్స్ థియేటర్ లో ఈ చిత్రాన్ని ప్రదర్శించే అరుదైన అవకాశం దక్కటం విశేషం. పారీస్ లో ఉన్న ఈ థియేటర్ లో ఇప్పటివరుకు దకిణ భారతదేశం నుంచి బాహుబలి 2, కబాలి చిత్రాలు మాత్రమే ప్రదర్శింపబడ్డాయి. ప్రపంచంలో అన్ని దేశాలతో పాటు పారీస్ తో పాటు యూఎస్ ఏ, లండన్, దుబాయ్, కెనాడా, మలేషియా తదితర దేశాల్లో అదిరింది భారీ స్థాయిలో అక్టోబర్ 18న దీపావళి కానుకగా విడుదల అవుతోంది.
ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ను మురళీ రామస్వామి, హేమా రుక్మిణి, తెన్నాండల్ స్టూడియోస్ ప్రై.లిమిటెడ్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. తెన్నాండల్ బ్యానర్లో నిర్మిస్తున్న వందో చిత్రం కావడం విశేషం. స్టార్ డైరెక్టర్ అట్లీ ఈ చిత్రానికి దర్శకుడు. ఆస్కార్ విన్నర్ ఎ.ఆర్.రెహమాన్ స్వరాలందిస్తున్నారు. తెన్నాండల్ స్టూడియోస్, నార్త్ స్టార్ ఎంటర్ టైన్ మెంట్స్ తో కలిసి తెలుగులో అదిరింది చిత్రాన్ని విడుదల చేస్తున్నారు.
మురళీ రామస్వామి మాట్లాడుతూ… నార్త్ స్టార్ ఎంటర్టైన్ మెంట్స్ బ్యానర్ అధినేత శరత్ మరార్ తో కలిసి తెన్నాండల్ స్టూడియోస్ తెలుగు ప్రేక్షకులకు ఈ చిత్రాన్ని అందించనున్నాం. మేము విడుదల చేస్తున్న అన్ని ప్రమెషన్ మెటీరియల్ కి అద్భుతమైన స్పందన రావడం చాలా హ్యాపీ గా ఉంది. తెలుగుతో డైనమిక్ ప్రోడ్యూసర్ శరత్ మరార్ గారు తెలుగులో గ్రాండ్ రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం పై విపరీతమైన క్రేజ్ రావటం తో ట్రేడ్ లో సూపర్బజ్ స్టార్టయ్యింది. రీసెంట్ గా తెలుగులో విడుదల చేసిన టీజర్ లో జి.కె.విష్ణు అందించిన షాట్స్ గురించి మాట్లాడుకుంటున్నారు. నువ్వు ముట్టుకున్నది అగ్నిగోళం.. దహించివేయుట దాని ధర్మం అనే డైలాగ్ బాగా ఫ్యామస్ అయ్యింది. విజయ్ లుక్ బాగుందని చూసినవారందరూ అంటున్నారు. దర్శకుడు అట్లీ చాలా సున్నితమైన స్క్రీప్ట్ ని కమర్షయల్ తీస్తారు. హీరోయిన్స్ సమంత, కాజల్, నిత్యామీనన్ నటించారు. ఈ దీపావళి కి విజయ్ ఫ్యాన్స్ నిజమైన పండగ చేసుకుంటారు. ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా దీపావళి కానుకగా అక్టోబర్ 18న ఈ చిత్రం ప్రేకకుల ముందుకి రాబోతుందని తెలిపారు.
శరత్ మరార్ మాట్లాడుతూ… విజయ్ 61వ చిత్రం, తెన్నాండల్ స్టూడియోస్ 100 చిత్రం అదిరింది సినిమాతో అసోసియేట్ కావడం చాలా హ్యాపీగా ఉంది. ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ను తెలుగులో గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నాం. ఈ సినిమాతో విజయ్ కి తెలుగు లో క్రేజ్ ట్రేడ్లో బిజినెస్ రేంజ్ పెరుగుతుంది. రాజా రాణి, తెరి వంటి కమర్షియల్ సూపర్ హిట్స్ ఇచ్చిన అట్లీ దర్శకత్వంలో వస్తున్న సినిమా కావడంతో అభిమానుల్లో అంచనాలు భారీగా వున్నాయి. బాహుబలి 2, కబాలి తరువాత మళ్లీ అదిరింది మాత్రమే లీ గ్రాండ్ రెక్స్ లో ప్రదర్శింపబడుతుందని. ఇలాంటి అరుదైన గౌరవం పొందిన సినిమాగా అదిరింది ఓ రికార్డ్ క్రియేట్ చేసింది. విజయ్ ఫెర్ఫార్మెన్స్ మరో రేంజి లో చూడబోతున్నారు. ఇప్పటికే టీజర్ లో షాట్స్ కి అప్లాజ్ రావటం విశేషం. సమంత, కాజల్, నిత్యామీనన్ లు పోటాపోటీగా నటించారు. ఈ చిత్రాన్ని దీపావళి కానుకగా అక్టోబర్ 18న ప్రేకకుల ముందుకి రాబోతుంది. ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది.
ప్రపంచం గర్వించదగ్గ చిత్రం బాహుబలి, సల్మాన్ ఖాన్ కు భారీ హిట్ అందించిన భజరంగీ భాయిజాన్ వంటి చిత్రాలకు కథ అందించిన విజయేంద్రప్రసాద్ అదిరింది చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే అందించడం విశేషం. ఈ చిత్రంలో విజయ్ తో పాటు ఎస్.జె.సూర్య, కాజల్ అగర్వాల్, సమంతా, నిత్యామీనన్, వడివేలు, కోవై సరళ, సత్యన్ మరియు సత్యరాజ్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఇండియాలోని పలు ప్రాంతాలతో పాటు యూరప్ లోని అందమైన లొకేషన్స్ లో ఈచిత్ర షూటింగ్ జరిగింది.
నటీనటులు - విజయ్, ఎస్.జె.సూర్య, కాజల్ అగర్వాల్, సమంతా, నిత్యామీనన్, వడివేలు, కోవై సరళ, సత్యన్ మరియు సత్యరాజ్
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com