ఒకరోజు ఆలస్యంగా విజయ్...
Send us your feedback to audioarticles@vaarta.com
తమిళ హీరో విజయ్ తెలుగులో తన మార్కెట్‌ను పెంచుకోవడానికి చాలా రోజులుగా ప్రయత్నం చేస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా, విజయ్ తన ప్రస్తుత చిత్రం `అదిరింది`(తమిళంలో `మెర్సల్`) సినిమాను ఈ నెల 18న విడుదల చేయాలని అనుకున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాను తెలుగులో విడుదల చేస్తున్న శరత్ మరార్ ఒక రోజు ఆలస్యంగా సినిమాను విడుదల చేయడానికి నిర్ణయం తీసుకున్నారట.
తమిళంలో సినిమా అక్టోబర్ 18న విడుదలవుతుంటే, తెలుగులో మాత్రం అక్టోబర్ 19న విడుదలకానుంది. అయితే రవితేజ `రాజాది గ్రేట్` చిత్రం మాత్రం అక్టోబర్ 18న విడుదలకానుంది. అదిరింది సినిమాలో విజయ్ త్రిపాత్రాభినయం చేస్తున్నాడు. అట్లీ దర్శకుడు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments