ఒకరోజు ఆలస్యంగా విజయ్...

  • IndiaGlitz, [Monday,October 16 2017]

త‌మిళ హీరో విజ‌య్ తెలుగులో త‌న మార్కెట్‌ను పెంచుకోవ‌డానికి చాలా రోజులుగా ప్ర‌య‌త్నం చేస్తున్న సంగ‌తి తెలిసిందే. అందులో భాగంగా, విజ‌య్ త‌న ప్ర‌స్తుత చిత్రం 'అదిరింది'(త‌మిళంలో 'మెర్స‌ల్‌') సినిమాను ఈ నెల 18న విడుద‌ల చేయాల‌ని అనుకున్నారు. అయితే తాజా స‌మాచారం ప్ర‌కారం ఈ సినిమాను తెలుగులో విడుద‌ల చేస్తున్న శ‌ర‌త్ మ‌రార్ ఒక రోజు ఆల‌స్యంగా సినిమాను విడుద‌ల చేయ‌డానికి నిర్ణ‌యం తీసుకున్నార‌ట‌.

త‌మిళంలో సినిమా అక్టోబ‌ర్ 18న విడుద‌ల‌వుతుంటే, తెలుగులో మాత్రం అక్టోబ‌ర్ 19న విడుద‌ల‌కానుంది. అయితే ర‌వితేజ 'రాజాది గ్రేట్‌' చిత్రం మాత్రం అక్టోబ‌ర్ 18న విడుద‌ల‌కానుంది. అదిరింది సినిమాలో విజ‌య్ త్రిపాత్రాభిన‌యం చేస్తున్నాడు. అట్లీ ద‌ర్శ‌కుడు.