గణిత మేధావి పాత్రలో విద్యాబాలన్...
Send us your feedback to audioarticles@vaarta.com
సిల్క్ స్మిత జీవితాన్ని డర్టీపిక్చర్ అంటూ తెరకెక్కించిన సంగతి తెలిసిందే. అందులో సిల్క్ స్మితగా నటించిన విద్యాబాలన్, తన నటనతో అందరినీ మెప్పించింది. తదుపరి `యన్.టి.ఆర్` బయోపిక్‌లో బసవతారకం పాత్రలో నటించింది. ఇప్పుడు మరో ఆసక్తికరమైన బయోపిక్‌లో నటించడానికి రెడీ అయ్యారు. ఈ బయోపిక్ ఎవరిదో కాదు..శకుంతలా దేవి. హ్యుమన్ కంప్యూటర్‌గా చెప్పుకునే శకుంతలాదేవి మహిళా గణిత మేధావి. ఈమె బయోపిక్‌లో విద్యాబాలన్ నటించనున్నారు.
ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ నేటి నుండి ప్రారంభమైంది. సోనీ పిక్చర్స్ అబుందంతియా ఎంటర్టైన్మెంట్ పతాకాలపై సినిమా నిర్మితం కానుంది. అనుమీనన్ దర్శకత్వంలో విక్రమ్ మల్హోత్రా నిర్మించబోయే ఈ బయోపిక్ వచ్చే ఏడాది సమ్మర్లో విడుదల కానుంది. ఈ సినిమా ఫస్ట్ లుక్, ప్రోమోను ఈ ఏడాదిలో విడుదల చేశారు.
ఉత్తరాదిలోనే కాకుండా దక్షిణాదిలో కూడా విద్యాబాలన్ సినిమాలు చేస్తున్నారు. ఈ ఏడాది యన్.టి.ఆర్ కథానాయకుడు, యన్.టి.ఆర్ మహానాయకుడు చిత్రాల్లో నటించిన విద్యాబాలన్, తమిళంలో కూడా అజిత్ సరసన నెర్కొండ పార్వ్యై చిత్రంలోనూ నటించారు. జయలలిత బయోపిక్ తలైవిలో కూడా ఈమెను నటింప చేయాలని ప్రయత్నాలు జరిగాయి కానీ.. ఎందుకనో విద్యాబాలన్ తలైవిలో నటించడానికి ఒప్పుకోలేదు. అయితే ఇందిరా గాంధీ జీవితగాథను ఆధారంగా చేసుకుని రూపొందబోయే వెబ్ సిరీస్‌లో నటిస్తుందని వార్తలు వినపడుతున్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout