మరో బయోపిక్ లో విద్యాబాలన్....
Send us your feedback to audioarticles@vaarta.com
డర్టీపిక్చర్ సినిమాలో సిల్క్ స్మిత పాత్రలో నటించిన విద్యాబాలన్ తనదైన నటనతో ఆకట్టుకున్న విద్యాబాలన్ త్వరలోనే అలనాటి తార మీనా కుమారి పాత్రలో కనపడనుందట. నిజానికి ఈ పాత్రలో ముందుగా ప్రియాంక చోప్రా, కంగనా రనౌత్‌లను హీరోయిన్స్‌గా అనుకున్నారట. అయితే చివరకు యూనిట్ వర్గాలు మీనాకుమారిగా విద్యాబాలన్ అయితే సరిపోతుందని భావించిందట.
విద్యాబాలన్‌ను సంప్రదించారట. అయితే విద్యాబాలన్ ఈ పాత్రలో నటించడానికి ఒప్పుకున్నారా లేదా అని తెలియడం లేదు. 2015లోనే మీనా కుమారి బయోపిక్‌ను తెరకెక్కించడానికి కంగనా రనౌత్‌ను ఎంపిక చేసుకున్నారట. అయితే కంగనా ఆ రోల్ చేయడానికి సరిపోదని మీనా కుమారి సోదరుడు అభ్యంతరం చెప్పడంతో సినిమా ఆగిపోయిందట. ఇప్పుడు మళ్లీ సినిమాను స్టార్ట్ చేయడానికి యూనిట్ తన వంతు ప్రయత్నాలను స్టార్ట్ చేసిందట.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments