షూటింగ్స్ సెట్స్‌లో సందడి చేస్తున్న పవన్, త్రివిక్రమ్.. వీడియో వైరల్

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మూడేళ్ల విరామానంతరం మళ్లీ సినిమాలతో బిజీ అయ్యారు. ఇటీవలే ‘వకీల్ సాబ్’ షూటింగ్‌ను పూర్తి చేసిన పవర్‌స్టార్ మరో రెండు సినిమాలను పట్టాలెక్కించిన పెట్టిన విషయం తెలిసిందే. ఇప్పటికే క్రిష్ దర్శకత్వంలో సినిమా షూటింగ్ జరుపుకుంటున్న విషయం తెలిసిందే. తాజాగా పవన్ నటిస్తున్న మరో సినిమా కూడా షూటింగ్ ప్రారంభించుకుంది. సాగర్ కె చంద్ర ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఈ చిత్రానికి స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే, డైలాగులు అందిస్తుడం విశేషం.

‘అయ్యప్పనుమ్ కోషియం’ చిత్రానికి రీమేక్‌‌గా ఈ సినిమా రూపొందుతోంది. ఈ సినిమాలో పవన్‌తో పాటు రానా కూడా నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో ప్రారంభమైంది. పవన్‌పై యాక్షన్ సన్నివేశాలను ప్రస్తుతం చిత్రీకరిస్తున్నారు. నేడు ఈ షూటింగ్ స్పాట్‌కు పవన్‌తోపాటు త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా వచ్చారు. ప్రస్తుతం వీరిద్దరూ కలిసి షూటింగ్ స్పాట్‌లో సందడి చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ ఏడాదిలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.