కన్నీళ్లు పెట్టుకున్న నవీన్ పొలిశెట్టి.. వీడియో వైరల్
Send us your feedback to audioarticles@vaarta.com
నవీన్ పొలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి జాతిరత్నాలుగా మెప్పించిన విషయం తెలిసిందే. ఈ సినిమా తొలిషోతోనే మంచి టాక్‌ను అందుకుంది. సినిమా ఎంటర్టైన్మెంట్ పరంగా కడుపుబ్బ నవ్వించింది. మహా శివరాత్రి కానుకగా గురువారం (మార్చి 11)న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ మూవీ పాజిటివ్ టాక్‌తో దూసుకెళుతోంది. నవీన్ ఒక్కడుంటేనే మంచి కామెడీతో నవ్విస్తాడు. అలాంటిది ఆయనకు ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ తోడవడంతో సినిమా ఆద్యంతం ప్రేక్షకుల చేత నవ్వులు పండించింది. నవీన్ పొలిశెట్టికి ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ తర్వాత ఆ రేంజ్ సక్సెస్‌ను అందించే సినిమా ఇదే అవతుందనడంలో సందేహం లేదు.
అయితే చిత్రం ఇంత మంచి పాజిటివ్ టాక్‌ను సంపాదించుకోవడంతో చిత్ర యూనిట్ ఆనందంలో మునిగి తేలుతోంది. ముఖ్యంగా నవీన్ పొలిశెట్టి ఆనందానికైతే అవధుల్లేకుండా పోయాయి. తొలి షో అనంతరం నవీన్ పొలిశెట్టి వెళ్లి నిర్మాత నాగ్ అశ్విన్‌ను హగ్ చేసుకుని భావోద్వేగానికి గురయ్యాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఎప్పుడు యాక్టివ్‌గా ఉంటూ.. స్పాంటినియస్‌గా నవీన్ పంచ్‌లు వేస్తుంటాడు. ఇటీవల చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా ‘జబర్దస్త్’ షోకి వచ్చిన నవీన్ పొలిశెట్టి.. కంటెస్టెంట్ల కంటే తనే ఎక్కువ స్పాంటీనియస్‌గా పంచ్‌లు వేస్తూ ఆకట్టుకున్నాడు. అలాంటి నవీన్ పొలిశెట్టి కన్నీరు పెట్టుకోవడం చూసి అభిమానులు షాక్ అవుతున్నారు.
సినిమా మంచి సక్సెస్ టాక్‌ను సంపాదించుకున్న సంతోషాన్ని ఒక్క రోజు కూడా నిలవనీయలేదు. కొందరు సైబర్ కేటుగాళ్లు ఈ సినిమాను పైరసీ చేసి కొన్ని వెబ్‌సైట్స్‌లో పెట్టేశారు. సరిగ్గా ఒక్క రోజు కూడా థియేటర్లో సినిమా ఆడకముందే ‘జాతి రత్నాలు' సినిమా ఫుల్ మూవీ డౌన్లోడ్ లింక్ కొన్ని వెబ్‌సైట్స్‌లో దర్శనమివ్వడం చిత్ర యూనిట్‌కి షాకింగ్‌గా మారింది. అద్భుతమైన సెట్టింగ్స్ ఉంటే పర్లేదు.. కానీ లేని సినిమాలకైతే పైరసీ కారణంగా గట్టి దెబ్బే తగిలే అవకాశం ఉంది. సినిమా కలెక్షన్స్‌పై ఎంతో కొంత ప్రభావం చూపే అవకాశం ఉంది. అయితే ఇది తమిళ్ రాకర్స్ చేసిన పనేనని భావిస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments