బిచ్చగాళ్లను పలకరిస్తూ, సెల్ఫీలు దిగిన సందీప్ కిషన్.. సుశాంత్ సింగ్‌తో పోలుస్తున్న ఫ్యాన్స్
Send us your feedback to audioarticles@vaarta.com
చిత్ర పరిశ్రమలోని హీరోలాంతా ఒకేలా వుండరు. కొందరు రిజర్వ్‌గా వుంటే.. మరికొందరు అందరితో కలుపుగోలుగా వుంటారు. సాధారణ స్థాయిలో వున్నా.. టాప్ స్టార్‌గా వున్నా వీరి తత్వంలో ఏమాత్రం మార్పు వుండదు. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే టాలీవుడ్ యువ హీరో సందీప్ కిషన్‌కు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట్లో వైరల్ అవుతోంది. సదరు వీడియోలో ఆయన ముంబైలో కనిపించాడు. అది కూడా ఏ సెలబ్రిటీల పక్కనో లేక స్టార్స్ పార్టీలోనో కేరింతలు కొడుతూ కాదు... రోడ్డు పక్కన భిక్షాటన చేసుకునే బిచ్చగాళ్లతో. వారిని అప్యాయంగా పలకరిస్తూ .. వాళ్లతో సెల్ఫీలు దిగాడు. ఇంకేముంది మీడియా కెమెరాలు క్లిక్‌మనిపించాయి.
ముంబై బాంద్రాలోని బస్తియాన్ నుంచి బయటకు వస్తుండగా బిచ్చగాళ్లు సందీప్ కిషన్ కారుని భిక్షాటన కోసం ఆపారు. అయితే జేబులోంచి వందో, రెండు వందలో తీసి వారిని పంపించవచ్చు . కాని సందీప్ కిషన్ అందుకు విరుద్ధంగా ప్రవర్తించారు. వారితో సెల్ఫీలు దిగి.. వాళ్లు ఏడుస్తుంటే ఓదార్చి .. 10 నిమిషాలకు పైగా వారితో గడిపి తర్వాత కారెక్కి వెళ్లిపోయాడు. అయితే సందీప్ కిషన్ అసలు ముంబైకి ఎందుకెళ్లాడు. సామాన్యుడిలాగా ఎందుకు ప్రవర్తించాడు అనే దానిపై ప్రస్తుతం చర్చ జరుగుతోంది. బిచ్చగాళ్లతో సందీప్ కిషన్ గడిపిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే దివంగత బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కూడా ఇలాగే ఫుట్‌పాత్‌పై వుండే బిచ్చగాళ్లతో చాలా ఫ్రెండ్లీగా వ్యవహరించేవారు. ప్రస్తుతం ఇది చూసిన ఆయన అభిమానులు .. సందీప్ కిషన్‌ను సౌతిండియన్ సుశాంత్ సింగ్‌గా అభివర్ణిస్తున్నారు.
ఇకపోతే సందీప్ కిషన్ ప్రస్తుతం ‘మైఖేల్’ అనే యాక్షన్ ఎంటర్టైనర్లో నటిస్తున్నారు. రంజిత్ జయకోడి దర్శకత్వం వహిస్తున్నారు. భరత్ చౌదరి, పుస్కూర్ రామ్ మోహన్ రావు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. దివ్యాంశ కౌశిక్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో విజయ్ సేతుపతి, వరలక్ష్మీ శరత్ కుమార్, వరుణ్ సందేశ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com