అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన విక్టరీ వెంకటేశ్

  • IndiaGlitz, [Thursday,January 24 2019]

సంక్రాంతికి విడుదలైన ‘F2’ మూవీతో అభిమానులను, సినీ ప్రియులను కడుపుబ్బా నవ్వించిన కొత్త అల్లుడు విక్టరీ వెంకటేశ్ అనారోగ్యంతో బాధపడుతున్నారు. గత కొద్దిరోజులుగా వెన్నునొప్పితో బాధపడుతున్న ఆయనకు గురువారం మధ్యాహ్నం తీవ్రమైంది. విశాఖలో ఉన్న నేచురల్ క్యూర్ ఆస్పత్రిలో ఆయన చేరారు. గతంలో కూడా ఇక్కడే ఆయన చికిత్స తీసుకున్నారు. కాగా ఆస్పత్రిలోనే కొద్దిరోజులు పాటు ఉండాలని వైద్యులు చెప్పినట్లు తెలిసింది.

ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత కూడా కొద్దిరోజులు విశ్రాంతి తీసుకోవాలని వెంకీకి డాక్టర్ సూచించారు. విశాఖలో వెంకీతో పాటు ఆయన కుటుంబీకులు కూడా ఉన్నట్లు సమాచారం. తమ అభిమాన నటుడు ఆస్పత్రిలో ఉన్నట్లు తెలుసుకున్న అభిమానులు, దగ్గుబాటి ఫ్యాన్స్ నేచురల్ క్యూర్ ఆస్పత్రికి వచ్చారు. కాగా ఇందుకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

కాగా.. చాలా గ్యాప్ తర్వాత వెంకీ తన అభిమానులు, సినీ ప్రియులకు ‘ఫన్ అండ్ ఫ్ట్రస్టేషన్’ ఇచ్చారు. ఈ F2ను సంక్రాంతికి రిలీజైన పెద్ద పెద్ద సినిమాలు సైతం ఢీ కొట్టలేకపోయాయి. సంక్రాంతికి వచ్చిన ఈ మూవీ సూపర్ డూపర్ హిట్టయ్యి రూ. 100 కోట్ల క్లబ్‌‌కు చేరువయ్యింది. పొంగల్ నుంచి ఇప్పటి వరకూ ఫన్ అండ్ ఫ్రస్టేషన్‌‌తో కాసుల వర్షం కురిపిస్తూనే ఉంది. సినిమా ఒక్కసారి చూస్తే మళ్లీ మళ్లీ చూడాలనిపించడంతో జనాలు థియేటర్లవైపు క్యూ కడుతున్నారు.

More News

రామ్, పూరిజగన్నాధ్ 'ఇస్మార్ట్ శంకర్' చిత్ర షూటింగ్ ప్రారంభం..!!

ఎనర్జిటిక్ హీరో రామ్, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ కలయికలో వస్తున్న 'ఇస్మార్ట్ శంకర్' చిత్రం షూటింగ్ నేడు ప్రారంభమయ్యింది..'డబుల్ ధమాకా దిమాక్ '

రవితేజ, వి ఐ ఆనంద్, ఎస్ ఆర్ టి ఎంట‌ర్టైన్మెంట్స్ టైటిల్ లోగో లాంఛ్

మాస్ మహారాజా రవితేజ, వి ఐ ఆనంద్ దర్శకత్వంలో ఎస్ ఆర్ టి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో నూత‌న చిత్రం మొద‌లుపెట్ట‌బోతున్నారు.

నన్ను చంపేస్తామని బెదిరిస్తున్నారు: వంగవీటి రాధా

"నన్ను చంపేస్తామని కొంతమంది బెదిరిస్తున్నారు" అని వైసీపీకి గుడ్ బై చెప్పిన వంగవీటి రాధా సంచలన వ్యాఖ్యలు చేశారు.

రాధా ఎఫెక్ట్.. వైసీపీలోకి దేవినేని..!?

విజయవాడలో గత కొద్దిరోజులుగా జరుగుతున్న రాజకీయ పరిణామాలతో రాష్ట్రం మొత్తం అటువైపే చూస్తోంది.

వైఎస్ జగన్ ఇప్పటికైనా పద్ధతి మార్చుకో : రాధా

వైసీపీని వీడిన విజయవాడ కీలకనేత వంగవీటి రాధా.. ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్‌‌రెడ్డికి పరోక్షంగా హెచ్చరికలు జారీచేశారు. రాజీనామా, టీడీపీ నేతల భేటీ అనంతరం ఫస్ట్ టైం మీడియా ముందుకు వచ్చిన రాధా