Sashivadane:‘శశివదనే’ చిత్రం నుంచి ‘వెతికా నిన్నిలా ..’ సాంగ్ రిలీజ్
Send us your feedback to audioarticles@vaarta.com
‘‘వెతికా నిన్నిలా.. కనుపాపల్లో కలలా
వెతికా నిన్నిలా.. వెతికా వెతికా...’’
అంటూ సత్యయామిని స్వరం నుంచి వినిపించే పాట వినగానే ఆకట్టుకుంటుంది. హీరో, హీరోయిన్‌కి మధ్య అనుకోకుండా ఎడబాటు వచ్చిందని, అతని కోసం ఆమె తపన పడిందని ఈ పాటను విన్నవారికి ఎవరికైనా ఇట్టే అర్థమైపోతుంది. వెతికా నిన్నిలా.. కనుపాపల్లో కలలా... అంటూ సాగే హుక్ లైన్ ఈ పాటను మళ్లీ మళ్లీ వినాలనిపించేలా చేస్తుందని అంటున్నారు శశివదనే మేకర్స్.
‘పలాస 1978’ ఫేం రక్షిత్ అట్లూరి, కోమలీ ప్రసాద్ హీరో హీరోయిన్లుగా నటిస్తోన్న చిత్రం ‘శశివదనే’. గౌరీ నాయుడు సమర్పణలో ఏజీ ఫిల్మ్ కంపెనీ, ఎస్.వి.ఎస్.స్టూడియోస్ బ్యానర్స్‌పై అహితేజ బెల్లంకొండ, అభిలాష్ రెడ్డి గోడల నిర్మిస్తున్నారు. గోదావరి నేపథ్యంలో లవ్ అండ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ సినిమాకు సాయి మోహన్ ఉబ్బర దర్శకత్వం వహించారు. ఏప్రిల్ 19న ఈ చిత్రాన్ని భారీ ఎత్తున విడుదల చేస్తున్నారు.
ఈ చిత్రం నుంచి ఇప్పటి వరకు విడుదలైన ‘శశివదనే..’, ‘డీజే పిల్లా..’, గోదారి అటువైపో.. పాటలకు ట్రెమెండెస్ రెస్పాన్స్ వచ్చింది. అలాగే రీసెంట్‌గా విడుదలైన టీజర్‌కు అమేజింగ్ స్పందన వచ్చింది. తాజాగా ఈ చిత్రం నుంచి వెతికా నిన్నిలా...’ పాటను మేకర్స్ విడుదల చేశారు. శరవణ భాస్కరన్ సంగీతం అందించిన ఈ పాటను సత్య యామిని పాడారు. కిట్టు విస్సా ప్రగడ రాశారు.
శరవణన్ వాసుదేవన్ సంగీతం సమకూరుస్తోన్న ఈ చిత్రానికి అనుదీప్ దేవ్ బ్యాగ్రౌండ్ స్కోర్ అందిస్తున్నారు. శ్రీసాయికుమార్ దారా సినిమాటోగ్రాఫర్‌గా, ఎడిటర్‌గా గ్యారీ బి.హెచ్ వర్క్ చేస్తున్నారు.
నటీనటులు: రక్షిత్ అట్లూరి, కోమలీ, శ్రీమన్, దీపక్ ప్రిన్స్, జబర్దస్త్ బాబీ, రంగస్థలం మహేష్ తదితరులు
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments