ప్రముఖ దర్శకుడు ధవళ సత్యంకు మాతృ వియోగం
- IndiaGlitz, [Saturday,July 06 2019]
విప్లవ చిత్రాల ప్రముఖ దర్శకుడు ధవళ సత్యం తల్లిగారైన ధవళ సరస్వతి(86) ఈ రోజు ఉదయం నర్సాపూర్ లో కన్నుమూశారు.
దర్శకుడు ధవళ సత్యం ఆమె పెద్ద కుమారుడు కాగా రెండవ కుమారుడు ధవళ చిన్నారావు చిత్ర పరిశ్రమలో ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ గా,మూడవ కుమారుడు ధవళ మల్లిక్ దర్శకుడిగానూ చిత్ర పరిశ్రమలోనే స్థిరపడ్డారు. నాలుగవ కుమారుడు లక్ష్మీ నరసింహారావు నర్సాపూర్ కాలేజీలో తెలుగు హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ గా పనిచేస్తున్నారు. కాగా తమ తల్లి అంత్యక్రియలు ఈ రోజు నర్సాపూర్ లో జరుగుతాయని ధవళ సత్యం తెలియజేసారు.