వెంటిలేటర్‌పై సీనియర్ నటి జయంతి..
Send us your feedback to audioarticles@vaarta.com
సీనియర్ నటి జయంతి ఆరోగ్యం బాగా క్షీణించింది. ప్రస్తుతం ఆమె వెంటిలేటర్‌పై ఉన్నారు. కొంతకాలంగా జయంతి ఆస్తమాతో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే మంగళవారం ఆమె శ్వాస తీసుకోవడానికి తీవ్రంగా ఇబ్బంది పడిటనట్టు తెలుస్తోంది. దీంతో జయంతి కుటుంబ సభ్యులు ఆమెను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వెంటిలేటర్‌పై ఉంచి చికిత్సను అందిస్తున్నామని.. 24 గంటలు గడిస్తే కానీ ఆరోగ్య పరిస్థితిని వెల్లడించలేమని వైద్యులు తెలిపారు. తెలుగు, కన్నడ, హిందీ, తమిళం, మలయాళం, మరాఠీ భాషల్లో ఆమె నటించారు. తెలుగులో హీరోయిన్గా తన కెరీర్‌ను ప్రారంరభించిన జయంతి.. ఆ తరువాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా ఎన్నో సినిమాల్లో నటించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments