చరణ్ చిత్రంలో మరో మాజీ కథానాయకుడు
Send us your feedback to audioarticles@vaarta.com
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. కుటుంబ నేపథ్యంలో సాగే ఈ మాస్ ఎంటర్టైనర్లో రామ్ చరణ్‌కు జోడీగా కైరా అద్వానీ నటిస్తోంది. ఇటీవల మొదటి షెడ్యూల్ పూర్తిచేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం రెండో షెడ్యూల్ జరుపుకుంటోంది. సోమవారం (ఫిబ్రవరి 19) నుంచి రామ్ చరణ్ కూడా చిత్రీకరణలో పాల్గొంటారని సమాచారం.
ఇదిలా ఉంటే.. ఐదుగురు అన్నదమ్ముల మధ్య సాగే కథే ఈ చిత్రమని వార్తలు వినిపిస్తున్నాయి. వీటిని నిజం చేస్తూ చరణ్‌కు పెద్దన్నయ్యగా తమిళ నటుడు ప్రశాంత్ నటిస్తున్నారు. ఈయనకు జంటగా సీనియర్ నటి స్నేహ నటిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే స్నేహపై కొన్ని సన్నివేశాలను కూడా చిత్రీకరించారు.
తాజాగా రెండో అన్నయ్య పాత్రకి సీనియర్ దర్శకుడు ఇ.వి.వి.సత్యనారాయణ తనయుడు ఆర్యన్ రాజేష్‌ను ఎంపిక చేసినట్టు సమాచారం. అతనికి జోడిగా 'జర్నీ' ఫేం అనన్య నటిస్తున్నట్టు సమాచారం. అలాగే, యువ కథానాయకుడు నవీన్ చంద్ర మూడో అన్నయ్యగా కనిపించనున్నారని ఇన్సైడ్ సోర్స్ టాక్. నాలుగో అన్నయ్యగా కనిపించే నటుడు ఎంపిక కావాల్సి ఉంది.
ఇప్పటికే ముగ్గురు అన్నయ్యలుగా నటిస్తున్న నటులు.. ఒకప్పుడు హీరోలుగా నటించినవారే. అంటే.. నాలుగో అన్నయ్యగా నటించబోయే నటుడు కూడా ఒకప్పటి హీరో అయ్యే అవకాశం లేకపోలేదు. మరి కొద్ది రోజుల్లో ఈ విషయంపై సస్పెన్స్ వీడనుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments