టాలీవుడ్లో విషాదం : అలనాటి నటుడు హరనాథ్ కుమార్తె పద్మజారాజు హఠాన్మరణం .. ఆ కల తీరకుండానే
Send us your feedback to audioarticles@vaarta.com
అలనాటి అందాల నటుడు హరనాథ్ కుమార్తె , ప్రముఖ నిర్మాత జి.వి.జి.రాజు భార్య పద్మజా రాజు హఠాన్మరణం చెందారు. ఆమె వయసు 54 సంవత్సరాలు. మంగళవారం మధ్యాహ్నం ఒక్కసారిగా గుండెపోటుకు గురికావడంతో పద్మజా కన్నుమూశారు. పద్మజారాజు భర్త జి.వి.జి.రాజు.. పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా గోకులంలో సీత, తొలిప్రేమ వంటి చిత్రాలు నిర్మించారు. అలాగే శేఖర్ కమ్ముల దర్శకత్వంలో సుమంత్ హీరోగా 'గోదావరి' సినిమాను కూడా తెరకెక్కించారు. ఇటీవల పద్మజారాజు తన తండ్రి దివంగత హరనాథ్ గురించి 'అందాల నటుడు' పేరుతో ఓ పుస్తకం కూడా ప్రచురించి.. దానిని సూపర్‌స్టార్ కృష్ణ చేతుల మీదుగా విడుదల చేశారు.
కొడుకును నిర్మాతగా చూడాలన్న కల తీరకుండానే :
త్వరలోనే తన కుమారుల్లో ఒకరిని నిర్మాతగా పరిచయం చేస్తున్నట్లు పద్మజారాజు తెలుగు వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. వచ్చే యేడాది తన తనయుణ్ణి నిర్మాతగా పరిచయం చేసే ప్రయత్నాల్లోనే పద్మజ, జి.వి.జి.రాజు ఉండగానే ఆమె హఠాన్మరణం చెందడం దురదృష్టకరం. పద్మజా రాజు మరణవార్త తెలుసుకున్న పలువురు సినీ ప్రముఖులు ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధించారు.
రాముడు, కృష్ణుడిగా అలరించిన హరనాథ్ :
ఇదిలావుండగా.. తెలుగు నాట అందాల నటుడిగా పేరు తెచ్చుకున్న హరనాథ్ 1959లో మా ఇంటి మహాలక్ష్మీ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయం అయ్యారు. శ్రీరాముడు, శ్రీకృష్ణుడంటూ ఎన్టీఆరేనని జనం గుండెల్లో ముద్రపడిన సమయంలో హరనాథ్ ఆ పాత్రల్లో నటించి మెప్పించారు. 1961 నుంచి 1972 వరకు హరనాథ్ వరుస హిట్లతో స్టార్ రేసులోకి దూసుకొచ్చారు. ఈ క్రమంలో మద్యానికి బానిసై కెరీర్‌ను చేజేతులా పాడు చేసుకున్నారు హరనాథ్. చివరికి చిన్నా చితకా పాత్రలతో జీవితాన్ని నెట్టుకొస్తూ.. 1989లో ఆయన కన్నుమూశారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout