శశికపూర్ కన్నుమూత
Send us your feedback to audioarticles@vaarta.com
బాలీవుడ్ సీనియర్ నటుడు శశికపూర్(79) అనారోగ్యంతో కన్నుమూశారు. అసిస్టెంట్ డైరెక్టర్‌గా కెరీర్‌ను స్టార్ట్ చేసిన శశికపూర్ తర్వాత హీరోగా, నిర్మాతగా, దర్శకుడిగా సినిమాల్లో తనదైన ముద్ర వేశారు. శశికపూర్‌కు లేడీ ఫాలోయింగ్ చాలా ఎక్కువగా ఉండేది. అందువల్ల తనను అందరూ లవర్‌బోయ్ అని పిలిచేవారు.
సినిమా రంగంలో ఆయన చేసిన సేవలకుగానూ భారత ప్రభుత్వం 2011లో పద్మభూషణ్ అవార్డుతో సత్కరించింది. అలాగే 2015లో ప్రతిష్టాత్మకమైన దాదాసాహెబ్ సహా పలు అవార్డులను ఆయన సొంతం చేసుకున్నారు.
ఆగ్ అనే సినిమాతో బాలనటుడిగాఎంట్రీ ఇచ్చిన శశికపూర్, ధర్మపుత్ర చిత్రంతో హీరోగా పరిచయం అయ్యారు. 175 సినిమాలకు పైగా చిత్రాల్లో నటించారు. ఆయన నిర్మాతగా జునూన్, కల్‌యుగ్, 36 చౌరింగీ లేన్, విజేత, ఉత్సవ్, అజుబా చిత్రాలను నిర్మించారు. అలాగే ఓజ్వారాచెచ్చెనియే అనే రష్యన్ సినిమాతో పాటు అజుబా అనే సినిమాను తన స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించారు. కబీ కబీ, దుస్‌రా ఆద్మీ, జమీన్ ఆస్మాన్ లాంటి పలు హిట్ చిత్రాలు ఆయన ఖాతాలో ఉన్నాయి.
అమితాబ్‌తో కలిసి శశికపూర్ దివార్, నమక్ హలాల్ చిత్రాల్లో నటించారు. శశికపూర్ మరణం పట్ల చిత్ర సీమ తమ సంతాపాన్ని తెలియజేసింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments