హోస్ట్‌గా మారుతున్న విలక్ష‌ణ న‌టుడు

  • IndiaGlitz, [Tuesday,December 11 2018]

త‌మిళంలో నేటి త‌రం విల‌క్ష‌ణ న‌టుల్లో విజ‌య్ సేతుప‌తి ఒక‌రు. ఈయ‌న ఇప్పుడు ఓ ప్రోగ్రామ్‌కి హోస్ట్‌గా మారుతున్నారు. ఇప్ప‌టికే త‌మిళంలో క‌మ‌ల్‌హాస‌న్‌, విశాల్‌, శృతిహాస‌న్‌, వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ త‌దిత‌రులు హోస్ట్‌లుగా మారారు.

వీరి బాట‌లో విజ‌య్ సేతుప‌తి అడుగు పెడుతున్నాడు. త్వ‌ర‌లోనే స‌న్ టీవీలో ప్ర‌సారం కానున్న ఈ షోలో స‌మాజంలో ఎంతో మందికి బాస‌ట‌గా నిలుస్తూ మీడియాలో పెద్ద‌గా క‌న‌ప‌డ‌ని వ్య‌క్తుల‌కు సంబంధించిన ప్రోగ్రామ్ ఇది.

అధికారిక స‌మాచారం వ‌చ్చినా.. ఎప్ప‌టి నుండి ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంద‌నేది ఇంకా తెలియ‌డం లేదు. అయితే త్వ‌ర‌లోనే ఈ ప్రోగ్రామ్ ప్ర‌సారం కానుంది.