close
Choose your channels

Weapon:వెర్సటైల్ యాక్టర్ సత్యరాజ్ 'వెపన్'.. యాక్షన్ ప్యాక్డ్ ఇంటెన్స్ టీజర్

Monday, August 21, 2023 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

మిర్చి, బాహుబలి సహా ఎన్నో చిత్రాల్లో నటించిన కోలీవుడ్ వెర్సటైల్ యాక్టర్ సత్యరాజ్, వసంత్ రవి ప్రధాన పాత్రధారులుగా నటిస్తోన్న సస్పెన్స్ థ్రిల్లర్ 'వెపన్'. మిలియన్ స్టూడియో బ్యానర్ పై గుహన్ సెన్నియప్పన్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. ఈ సినిమా టీజర్ ను మేకర్స్ రీసెంట్ గా రోజున విడుదల చేశారు. టీజర్ ను గమనిస్తే చాలా ఆసక్తికరంగా ఉంది. యాక్షన్ ప్యాక్డ్ ఇన్టెన్స్ థ్రిల్లర్ లో సత్యరాజ్, వసంత్ రవి పాత్రలను నెక్ట్స్ రేంజ్ లో రూపొందించినట్లు స్పష్టమవుతుంది. సత్యరాజ్, వసంత్ రవిలపై చిత్రీకరించిన యాక్షన్ సన్నివేశాలు కూడా ఆకట్టుకుంటున్నాయి. ఇక నటన పరంగా ఇటు సత్యరాజ్, అటు వసంత్ రవి తమదైన విలక్షణతను చాటుకునేలా పెర్ఫామెన్స్ ఇరగదీశారు.

ప్రభు రాఘవ్ సినిమాటోగ్రఫీ, గిబ్రాన్ నేపథ్య సంగీతం సినిమాకు హైలైట్ గా నిలుస్తున్నాయి. సూపర్ హ్యూమన్ గురించి అన్వేషణ జరుగుతుంటుంది. అసలా సూపర్ హ్యుమన్ ఎవరు సత్యరాజా? వసంత్ రవినా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందేననే క్యూరియాసిటీ కలుగుతుంది. సినిమా ట్రైలర్, ఇతర వివరాలను త్వరలోనే తెలియజేస్తామని మేకర్స్ తెలియజేశారు.

ఈ చిత్రాన్ని తమిళం, తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ చేయటానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.

నటీనటులు: సత్యరాజ్, వసంత్ రవి, రాజీవ్ మీనన్, తాన్యా హోప్, రాజీవ్ పిళ్లై, యషికా ఆనంద్, మైమ్ గోపి, కణిత, గజరాజ్, సయ్యద్ సుభాన్, భరద్వాజ్ రంగన్ తదితరులు

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.   

Comments

Welcome to IndiaGlitz comments! Please keep conversations courteous and relevant to the topic. To ensure productive and respectful discussions, you may see comments from our Community Managers, marked with an "IndiaGlitz Staff" label. For more details, refer to our community guidelines.
settings
Login to post comment
Cancel
Comment