Venu Swami: వేణు స్వామి- వీణ శ్రీవాణికి జత ఎలా కలిసింది.. సినిమాను తలపించే వీరి లవ్‌స్టోరీ తెలుసా..?
Send us your feedback to audioarticles@vaarta.com
ప్రేమ గుడ్డిదంటారు. దీనికి ఆస్తి, అందం, పొట్టి , పొడుగు, నలుపు, తెలుపు, కులం, మతం, వయసు, ప్రాంతం ఇలాంటి తేడాలేవి లేవు. ఎవరిలోనైనా ప్రేమ పుట్టొచ్చు. కొందరు తమ ప్రేమను పండించుకుని పెళ్లి పీటల వరకు తీసుకొస్తే .. మరికొందరికి మాత్రం మధ్యలో బ్రేకప్ జరగొచ్చు, లేదంటే పెద్దలు అంగీకరించకపోవచ్చు. కానీ ప్రేమను నిలబెట్టుకున్న జంటలు మాత్రం చిరస్థాయిగా నిలిచిపోతాయి. ఇకపోతే.. బాగా అందంగా వున్న అమ్మాయికి.. నల్ల కర్రి లాంటి అబ్బాయితో ప్రేమ సెట్ అవొచ్చు. లేదంటే బాగా లావుగా వున్న అమ్మాయికి.. మన్మథుడి లాంటి వ్యక్తి ప్రేమికుడిగా తారసపడొచ్చు. మన చిత్ర పరిశ్రమలోనూ ఇలాంటి ఘటనలు అనేకం.
ఫలిస్తున్న వేణుస్వామి జోస్యాలు:
ఇక సినిమా వాళ్లకు జ్యోతిష్యం చెబుతూ.. సంచలన ప్రకటనలు ఇచ్చే వేణు స్వామికి ఎంత క్రేజ్ వుందో చెప్పనక్కర్లేదు. సమంత, నాగచైతన్య సహా పలువురు విషయంలో వేణు స్వామి చెప్పిన జోస్యాలు చాలా వరకు నిజం కావడంతో ఆయన మాటలపై బాగా గురి కుదిరింది. ఇక కొద్దిరోజుల క్రితం చిత్ర పరిశ్రమకు చెందిన ఓ 45 ఏళ్ల లోపు హీరో చనిపోతాడని వేణుస్వామి చెప్పారు. ఆయన అన్నట్లుగానే తారకరత్న కన్నుమూసిన సంగతి తెలిసిందే.
వీణ క్లాసులు చెబుతూ ఆర్ఆర్‌బీకి శిక్షణ:
అయితే చాలా మంది మాదిరే వేణుస్వామికి కూడా లవ్‌స్టోరీ వుంది. ఈయన భార్య ఎవరో కాదు.. ప్రముఖ యాంకర్, వీణ విద్వాంసురాలు.. వీణ శ్రీవాణి. వీరిద్దరి ప్రేమ వివాహం. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో శ్రీవాణి ఇందుకు సంబంధించిన వివరాలు పంచుకున్నారు. తనకు రైల్వే జాబ్ వచ్చాక.. ట్రైనింగ్ కోసం హైదరాబాద్ వచ్చానని ఆమె తెలిపారు. అక్కడ ఖర్చుల కోసం వీణ క్లాసులు చెప్పేదానినని.. తన భర్త వాళ్ల కజిన్ కూతురు కూడా తన దగ్గరకు క్లాసులకు వచ్చేదని శ్రీవాణి వెల్లడించారు. ఆమెను ఇంటికి తీసుకెళ్లడానికి ఓ రోజున వేణుస్వామి తన ఇంటికి వచ్చాడని.. ఈ సందర్భంలో పెళ్లంటూ చేసుకుంటూ ఈ అమ్మాయినే చేసుకుంటానని చెప్పారని శ్రీవాణి పేర్కొన్నారు.
అందానికి ప్రాధాన్యం ఇవ్వనన్న శ్రీవాణి:
ఆ తర్వాత కొన్నాళ్లకు వేణుస్వామి తనకు ప్రపోజ్ చేశారని ఆమె చెప్పారు. ఇదే సమయంలో తన భర్త లావుగా వున్నారన్న ప్రశ్నకు శ్రీవాణి సమాధానం చెబుతూ.. తాను అందానికి ప్రాధాన్యత ఇవ్వనని, ఆరోజున సన్నగా వున్న తాను ఏదో ఒకరోజు లావుగా మారతానని ఆమె అన్నారు. అయితే ఇరు కుటుంబాల నుంచి వీరి ప్రేమకు అంగీకారం లభించకపోయినా ఇద్దరూ కలిసి పెళ్లి పీటలెక్కారు. ఈ క్రమంలో తనకు తల్లి తరపు వాళ్లు దూరమైనా తన భర్త ఆ లోటు తెలియనీయలేదని శ్రీవాణి వెల్లడించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments