‘వకీల్‌సాబ్’లో పవన్ ఎంట్రీ కొంచెం లేటుగా ఉంటుంది: వేణు శ్రీరామ్
Send us your feedback to audioarticles@vaarta.com
పవర్ స్టార్ పవన్‌కల్యాణ్ కథానాయకుడిగా నటిస్తున్న సినిమా ‘వకీల్ సాబ్’. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. బాలీవుడ్‌లో మంచి సక్సెస్ సాధించిన ‘పింక్’ చిత్రానికి రీమేక్‌గా ‘వకీల్ సాబ్’ తెరకెక్కుతోందన్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో శ్రుతి హాసన్, అంజలి, నివేదా థామస్, అనన్యా నాగళ్ల ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నారు. బోనీ కపూర్ సమర్పణలో ‘దిల్’ రాజు, శిరీష్ ‘వకీల్‌సాబ్’ను నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను దర్శకుడు వేణు శ్రీరామ్ ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు.
కథను పవన్ కల్యాణ్ బాడీ లాంగ్వేజ్‌కు తగ్గట్టు మార్పు చేశామని వేణు శ్రీరామ్ తెలిపారు. పవన్ పాత్ర నిడివి గురించి ఆందోళన చెందవద్దని.. సినిమా ప్రారంభమైన అనంతరం కాస్త లేటుగా పవన్ ఎంట్రీ ఉంటుందని వేణు శ్రీరామ్ వెల్లడించారు. వకీల్ సాబ్’ కథకు కొన్ని పరిమితులున్నాయని ఆయన పేర్కొన్నారు. ఒక మాస్ పాట పెట్టి, అవుట్ అండ్ అవుట్ కమర్షియల్‌గా చేయలేని కథ అని వెల్లడించారు. అందుకని, ఆ పరిమితులకు లోబడి... పవన్ కల్యాణ్ బాడీ లాంగ్వేజ్‌కి అలవాటు పడ్డ నాలాంటి అభిమానులకు ఏం కావాలో ఆ మార్పులు చేశామన్నారు.
ఇక ‘వకీల్‌సాబ్’లో ఆయన పాత్ర నిడివి గురించి ఆందోళన చెందవద్దని తెలిపారు. సినిమా ప్రారంభమైన తర్వాత పవన్ తెరపైకి కొంచెం లేటుగా వస్తారని.. అయినప్పటికీ ఆయన ఎంట్రీ చాలా లేటెస్టుగా ఉంటుందని వేణు శ్రీరామ్ పేర్కొన్నారు. మరో ఆసక్తికర విషయాన్ని కూడా ఆయన వెల్లడించారు. ఇటీవల విడుదల చేసిన ‘వకీల్ సాబ్’ ఫస్ట్‌లుక్‌లో పవన్ ట్రక్కులో పుస్తకం చదువుతూ కనిపిస్తారు. అయితే ‘వకీల్ సాబ్’ చిత్రీకరణలో తొలిరోజు పవన్‌పై తీసిన తొలి షాట్ అదేనని వేణు శ్రీరామ్ వెల్లడించారు. సినిమాలో మొత్తం ఐదు పాటలు ఉంటాయని కూడా తెలిపారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout