చివరి కోరిక తీరకుండానే వేణుమాధవ్ కన్నుమూత!
Send us your feedback to audioarticles@vaarta.com
టాలీవుడ్ ప్రముఖ హాస్యనటుడు వేణుమాధవ్ అనారోగ్యంతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. గత కొన్ని రోజులుగా కాలేయ, కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న ఆయన.. సికింద్రాబాద్ యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన మరణంతో టాలీవుడ్‌లో విషాదఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.
వేణుమాధవ్ తన ఆఖరి కోరిక తీరకుండానే తుదిశ్వాస విడిచారు. ఒకట్రెండు కాదు ఏకంగా 20 ఏళ్ల పాటు సినిమాల్లో బిజీస్టార్‌గా ఉన్న వేణు.. రాజకీయాల్లో రాణించాలనే కోరిక బలంగా ఉండేది. దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ ‘తెలుగుదేశం’ పార్టీ పెట్టినప్పట్నుంచి ఆయన కార్యకర్తగా పనిచేస్తున్నారు. టీడీపీ కార్యక్రమాలు ఎక్కడ జరిగినా సరే తప్పకుండా వెళ్లి హాజరయ్యేవారు. అంతేకాదు.. టీడీపీ తరఫున ఎన్నికల ప్రచారానికి వెళ్తుండేవారు. నంద్యాల ఉపఎన్నికల్లో వేణుమాధవ్.. టీడీపీ తరఫున చేసిన హడావుడి అంతా ఇంతా కాదు.
అలా పార్టీ కోసం పనిచేసిన ఆయన ఎమ్మెల్యే కావాలన్నదే ఆఖరికోరికగా పెట్టుకున్నారు. అందుకే పలుమార్లు ఎన్నికల్లో పోటీ చేయాలని భావించారు. తన సొంత ఊరైన కోదాడ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని వేణుమాధవ్ ఎన్నో ప్రయత్నాలు చేశారు. అయితే ఆ ప్రయత్నాల్లో ఒక్కటి కూడా వర్కవుట్ అవ్వలేదు. రాష్ట్ర విభజన అనంతరం 2014లో జరిగిన ఎన్నికల్లో కోదాడ నుంచి పోటీ చేయాలని టీడీపీ అధిష్టానంతో తన మనసులోని మాట చెప్పినప్పటికీ ఒప్పుకోలేదు. అయినప్పటికీ పార్టీకి విధేయుడిగా సామాన్య కార్యకర్తగా పనిచేస్తూ వచ్చారు.
మళ్లీ 2018 ముందస్తు ఎన్నికల్లో పోటీ చేయాలని టికెట్ అడగ్గా రాకపోవడంతో ఇండిపెండెంట్‌గా పోటీ చేయాలని భావించి నామినేషన్ వేశారు. అయితే ఆ పత్రాలు సరిగ్గా లేకపోవడంతో ఒకట్రెండు సార్లు రిటర్నింగ్ అధికారి.. వేణుమాధవ్‌ను వెనక్కి పంపారు. ఇలా రెండుసార్లు ప్రయత్నాలు చేసినప్పటికీ వేణు విఫలమయ్యారు. దీంతో ఆయన రాజకీయంగా రాణించి ఎమ్మెల్యే కావాలన్న కోరిక తీరకుండానే తుదిశ్వాస విడించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments