చివరి కోరిక తీరకుండానే వేణుమాధవ్ కన్నుమూత!

  • IndiaGlitz, [Wednesday,September 25 2019]

టాలీవుడ్ ప్రముఖ హాస్యనటుడు వేణుమాధవ్ అనారోగ్యంతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. గత కొన్ని రోజులుగా కాలేయ, కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న ఆయన.. సికింద్రాబాద్ యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన మరణంతో టాలీవుడ్‌లో విషాదఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.

వేణుమాధవ్ తన ఆఖరి కోరిక తీరకుండానే తుదిశ్వాస విడిచారు. ఒకట్రెండు కాదు ఏకంగా 20 ఏళ్ల పాటు సినిమాల్లో బిజీస్టార్‌గా ఉన్న వేణు.. రాజకీయాల్లో రాణించాలనే కోరిక బలంగా ఉండేది. దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ ‘తెలుగుదేశం’ పార్టీ పెట్టినప్పట్నుంచి ఆయన కార్యకర్తగా పనిచేస్తున్నారు. టీడీపీ కార్యక్రమాలు ఎక్కడ జరిగినా సరే తప్పకుండా వెళ్లి హాజరయ్యేవారు. అంతేకాదు.. టీడీపీ తరఫున ఎన్నికల ప్రచారానికి వెళ్తుండేవారు. నంద్యాల ఉపఎన్నికల్లో వేణుమాధవ్.. టీడీపీ తరఫున చేసిన హడావుడి అంతా ఇంతా కాదు.

అలా పార్టీ కోసం పనిచేసిన ఆయన ఎమ్మెల్యే కావాలన్నదే ఆఖరికోరికగా పెట్టుకున్నారు. అందుకే పలుమార్లు ఎన్నికల్లో పోటీ చేయాలని భావించారు. తన సొంత ఊరైన కోదాడ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని వేణుమాధవ్ ఎన్నో ప్రయత్నాలు చేశారు. అయితే ఆ ప్రయత్నాల్లో ఒక్కటి కూడా వర్కవుట్ అవ్వలేదు. రాష్ట్ర విభజన అనంతరం 2014లో జరిగిన ఎన్నికల్లో కోదాడ నుంచి పోటీ చేయాలని టీడీపీ అధిష్టానంతో తన మనసులోని మాట చెప్పినప్పటికీ ఒప్పుకోలేదు. అయినప్పటికీ పార్టీకి విధేయుడిగా సామాన్య కార్యకర్తగా పనిచేస్తూ వచ్చారు.

మళ్లీ 2018 ముందస్తు ఎన్నికల్లో పోటీ చేయాలని టికెట్ అడగ్గా రాకపోవడంతో ఇండిపెండెంట్‌గా పోటీ చేయాలని భావించి నామినేషన్ వేశారు. అయితే ఆ పత్రాలు సరిగ్గా లేకపోవడంతో ఒకట్రెండు సార్లు రిటర్నింగ్ అధికారి.. వేణుమాధవ్‌ను వెనక్కి పంపారు. ఇలా రెండుసార్లు ప్రయత్నాలు చేసినప్పటికీ వేణు విఫలమయ్యారు. దీంతో ఆయన రాజకీయంగా రాణించి ఎమ్మెల్యే కావాలన్న కోరిక తీరకుండానే తుదిశ్వాస విడించారు.

More News

ప్రముఖ కమెడియన్ వేణుమాధవ్ ఇకలేరు

టాలీవుడ్ ప్రముఖ కమెడియన్ వేణు మాధవ్ కన్నుమూశారు. గత కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మధ్యాహ్నం 12:21 గంటలకు తుదిశ్వాస విడిచారు.

'నిశ్శ‌బ్దం' గా అనుష్క క‌ష్టం

గ‌త ఏడాది `భాగ‌మ‌తి`తో హిట్‌ను సొంతం చేసుకున్న టాలీవుడ్ జేజమ్మ అనుష్క శెట్టి.. సినిమాల‌కు గ్యాప్ తీసుకుంది.

ఆస‌క్తిక‌ర‌మైన బ్యాక్‌డ్రాప్‌లో వెంకీ

విక్ట‌రీ వెంక‌టేశ్ ప్ర‌స్తుతం సినిమాల ఎంపిక‌లో వైవిధ్య‌త‌తో పాటు..వేగాన్ని చూపిస్తున్నారు. ఈ ఏడాది సంక్రాంతికి `ఎఫ్ 2`తో భారీ విజ‌యాన్ని త‌న ఖాతాలో వేసుకున్నారు.

అమితాబ్‌కు దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారం..

బాలీవుడ్ షెహెన్‌షా, భారతదేశం గర్వించదగ్గ నటుడు అమితాబ్ బచ్చన్‌‌‌ను మరో అత్యున్నత పురస్కారం వరించింది.

మోహ‌న్‌లాల్‌తో 13 ఏళ్ల మ్యూజిక్ డైరెక్ట‌ర్‌

బాలీవుడ్, ద‌క్షిణాది సినిమా ప‌రిశ్ర‌మ‌కు ప‌రిచ‌యం అక్క‌ర్లేని పేరు మోహ‌న్‌లాల్‌. ఈ మల‌యాళ సూప‌ర్‌స్టార్ ఇప్పుడు మెగాఫోన్ ప‌ట్ట‌బోతున్నాడు.