కమెడియన్ వేణుమాధవ్ ఆరోగ్య పరిస్థితి విషమం

  • IndiaGlitz, [Tuesday,September 24 2019]

టాలీవుడ్‌లో ఒకప్పుడు హాస్యం అంటే టక్కున గుర్తొచ్చే వారిలో వేణుమాధవ్ ఒకరు. ఒకట్రెండు కాదు.. చాలా చిత్రాల్లో తన నటనతో సినీ ప్రియులను మెప్పించారు. తన నటనతో ఎంతో మంది నవ్వించిన వేణుమాధవ్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. వేణు మాధవ్ గత కొంతకాలంగా కాలేయ సంబంధ వ్యాధితో బాధపడుతున్నారు. ఇటీవల సమస్య తీవ్రం కావడంతో నగరంలోని సికింద్రాబాద్ యశోదా ఆస్పత్రిలో చేరారు. దీంతో పాటు కిడ్నీ సంబంధిత సమస్యలు కూడా తలెత్తడంతో ఆయన ఆరోగ్యపరిస్థితి విషమంగా ఉందని.. వెంటిలేటర్ సాయంతో చికిత్స అందిస్తున్నామని ఆస్పత్రి వైద్యులు మీడియాకు వెల్లడించారు.

కాగా.. ఇప్పటికే పలుమార్లు వేణుమాధవ్ ఆరోగ్యపరిస్థితిపై వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే అవన్నీ పుకార్లేనని.. తాను అన్ని విధాలుగా బాగున్నానని, తన ఆరోగ్యం గురించి ఎవరు కూడా చింతించాల్సిన అవసరం లేదని అప్పట్లో క్లారిటీ ఇచ్చుకున్న సంగతి తెలిసిందే.

More News

‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ సాంగ్ వచ్చేసిందోచ్!

టాలీవుడ్ వివాదాస్పద దర్శకుడు ఆర్జీవీ.. ఏం చేసినా సంచలనమే. సినిమా తీసినా.. ట్విట్టరెక్కి ట్వీట్ చేసినా అది సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అవుతుంది.

'గద్దలకొండ గణేష్' ని అభినందించిన మెగాస్టార్ చిరంజీవి

మెగాప్రిన్స్‌ వరుణ్‌ తేజ్‌, పవర్‌ఫుల్‌ డైరెక్టర్‌ హరీష్‌ శంకర్‌ ఎస్ కాంబినేషన్‌లో 14 రీల్స్‌ ప్లస్‌ బేనర్‌పై రామ్‌ ఆచంట, గోపీ ఆచంట నిర్మించిన 'గద్దలకొండగణేష్‌'

రేవంత్‌కు ఊహించని షాకిచ్చిన కాంగ్రెస్!!

భారతదేశంలోనే అతిపెద్ద పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలిచిన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఊహించని షాకిచ్చిందా..?

‘2.0 పూర్తయ్యేనాటికి నా రాజకీయ జీవితం ముగుస్తుంది’

బీజేపీ నేతలు, కేంద్ర మంత్రుల పరిస్థితి 2019 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చాక ‘ఎవరికి వారే యమునా తీరే’ అన్నట్లుగా ఉంది.

చిరు కుమార్తెను టార్గెట్ చేసిన కత్తి.. షాకింగ్ కామెంట్స్!

టాలీవుడ్ సినీ క్రిటిక్ కత్తి మహేశ్ మరోసారి వార్తల్లో నిలిచారు. వివాదాలే నా ఊపిరి.. సర్వస్వం అంటూ రోజుకు రెండు ట్వీట్లు..