close
Choose your channels

కమెడియన్ వేణుమాధవ్ ఆరోగ్య పరిస్థితి విషమం

Tuesday, September 24, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

కమెడియన్ వేణుమాధవ్ ఆరోగ్య పరిస్థితి విషమం

టాలీవుడ్‌లో ఒకప్పుడు హాస్యం అంటే టక్కున గుర్తొచ్చే వారిలో వేణుమాధవ్ ఒకరు. ఒకట్రెండు కాదు.. చాలా చిత్రాల్లో తన నటనతో సినీ ప్రియులను మెప్పించారు. తన నటనతో ఎంతో మంది నవ్వించిన వేణుమాధవ్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. వేణు మాధవ్ గత కొంతకాలంగా కాలేయ సంబంధ వ్యాధితో బాధపడుతున్నారు. ఇటీవల సమస్య తీవ్రం కావడంతో నగరంలోని సికింద్రాబాద్ యశోదా ఆస్పత్రిలో చేరారు. దీంతో పాటు కిడ్నీ సంబంధిత సమస్యలు కూడా తలెత్తడంతో ఆయన ఆరోగ్యపరిస్థితి విషమంగా ఉందని.. వెంటిలేటర్ సాయంతో చికిత్స అందిస్తున్నామని ఆస్పత్రి వైద్యులు మీడియాకు వెల్లడించారు.

కాగా.. ఇప్పటికే పలుమార్లు వేణుమాధవ్ ఆరోగ్యపరిస్థితిపై వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే అవన్నీ పుకార్లేనని.. తాను అన్ని విధాలుగా బాగున్నానని, తన ఆరోగ్యం గురించి ఎవరు కూడా చింతించాల్సిన అవసరం లేదని అప్పట్లో క్లారిటీ ఇచ్చుకున్న సంగతి తెలిసిందే.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.   

Comments

Welcome to IndiaGlitz comments! Please keep conversations courteous and relevant to the topic. To ensure productive and respectful discussions, you may see comments from our Community Managers, marked with an "IndiaGlitz Staff" label. For more details, refer to our community guidelines.
settings
Login to post comment
Cancel
Comment