ముస్తాబవుతున్న 'వెన్నెల్లో హాయ్ హాయ్'
Send us your feedback to audioarticles@vaarta.com
సీనియర్ దర్శకుడు వంశీ దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రానికి వెన్నెల్లో హాయ్ హాయ్` అనే పేరును ఖరారు చేశారు. అజ్మల్, నిఖిత నారాయణ్ జంటగా నటిస్తున్న ఈ చిత్రాన్ని డి.వి.సినీ క్రియేషన్స్ పతాకంపై డి. వెంకటేష్ నిర్మించారు.
అక్టోబర్‌లో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రం విశేషాలను నిర్మాత తెలియజేస్తూ నాకు వంశీగారంటే ఎంతో అభిమానం. చక్కటి కుటుంబ విలువలతో మేళవింపుతో తెరకెక్కించిన అందమైన ప్రేమకథా చిత్రమిది. వంశీ మార్క్ కామెడీతో ఆద్యంతం ఆకట్టుకుంటుంది.తెలుగు చిత్రసీమ గర్వించే దిగ్ధర్శకుడైన వంశీతో కలిసిన పనిచేయడం ఆనందంగా వుంది.తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేస్తూ చిత్రాల్ని తీసే వంశీ దర్శకత్వంలో సినిమా నిర్మించడం నా అదృష్టంగా భావిస్తున్నాను` అని తెలిపారు.
ఈ చిత్రానికి కథ: మల్లాది వెంకటకృష్ణమూర్తి, మాటలు: చందు, కెమెరా: యం.వి.రఘు, ఆర్ట్: రవీంద్రనాథ్ ఠాగూర్, కొరియోగ్రఫీ: స్వర్ణ, పాటలు: ప్రవీణ్ లక్మ, సంగీతం: చక్రి, సమర్పణ: నిఖితశ్రీ, నిర్మాత: డి. వెంకటేష్, దర్శకుడు: వంశీ.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments