'య‌న్.టి.ఆర్‌' లో వెన్నెల కిషోర్‌

  • IndiaGlitz, [Saturday,December 01 2018]

నంద‌మూరి బాల‌కృష్ణ టైటిల్ పాత్ర‌లో న‌టిస్తూ నిర్మిస్తున్న చిత్రం ఎన్టీఆర్ బ‌యోపిక్ 'య‌న్‌.టి.ఆర్ క‌థానాయకుడు', 'య‌న్‌.టి.ఆర్ మ‌హానాయ‌కుడు' అనే రెండు భాగాలుగా విడుద‌ల కానుంది.ఇందులో మొద‌టి భాగం 'య‌న్‌.టి.ఆర్ క‌థానాయ‌కుడు' జ‌న‌వ‌వ‌రి 9న ..రెండో భాగం 'య‌న్.టి.ఆర్ మ‌హానాయకుడు' జ‌న‌వ‌రి 24న విడుద‌ల కానున్నాయి.

కాగా ఈ సినిమాలో బాలీవుడ్‌, టాలీవుడ్ స్టార్స్ అంద‌రూ న‌టిస్తున్నారు. ఈ లిస్టు చాలానే ఉంది. ఇప్పుడు ఆ లిస్టులో చేరాడు క‌మెడియ‌న్ వెన్నెల కిషోర్‌. ఎన్టీఆర్ బావ‌మ‌రిది రుక్మ‌నంద‌రావు పాత్ర‌లో వెన్నెల కిషోర్ క‌న‌ప‌డ‌బోతున్నార‌ట‌.