Macharla Niyojakavargam : ‘గుంతలకిడి గురునాథం’గా వెన్నెల కిశోర్ ఫస్ట్‌లుక్ విడుదల.. మరి అంత ఇగోనా..!!

  • IndiaGlitz, [Wednesday,July 20 2022]

గతేడాది కరోనా ప్రభావంలో కూడా మూడు సినిమాలను తీసుకొచ్చిన హీరో నితిన్ ఒక్కడే. భీష్మ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత మాస్ట్రో, చెక్, రంగ్ దే వంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలైన సంగతి తెలిసిందే. ఈసారి ఎలాగైనా మంచి హిట్ అందుకోవాలని గట్టి ప్రయత్నాల్లో ఉన్న నితిన్ ఇప్పుడు ఓ పొలిటికల్ డ్రామాతో ప్రేక్షకులను అలరించాడు. ఆ సినిమానే మాచర్ల నియోజక వర్గం.

రాజశేఖర్ రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో నితిన్ జిల్లా కలెక్టర్‌గా నటిస్తున్నారు. మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తోన్న ఈ సినిమాలో.. నితిన్ సరసన కృతిశెట్టి, కేథరిన్ హీరోయిన్లుగా ఆడిపాడనున్నారు. ఆదిత్య మూవీస్ & ఎంట‌ర్టైన‌మెంట్స్, శ్రేష్ఠ్ మూవీస్ బ్యాన‌ర్ల‌పై ఎన్‌.సుధాక‌ర్ రెడ్డి, నిఖితా రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా ఆగస్ట్ 12న మాచర్ల నియోజక వర్గాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు.

మంచి హిట్ కోసం వెయిట్ చేస్తోన్న నితిన్ ఈ సినిమాలో అన్ని వర్గాలను ఆకట్టుకునే అంశాలు వుండాలని భావిస్తున్నారు. దీనిలో భాగంగానే మాస్ కోసం అంజలితో కలిసి చేసిన స్పెషల్ సాంగ్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇందులో కామెడీ ట్రాక్‌కు కూడా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఈ క్రమంలోనే కమెడియన్ వెన్నెల కిషోర్ పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్‌ను చిత్ర యూనిట్ బుధవారం విడుదల చేశారు. ఇందులో ఆయన గుంతలకడి గురునాథం అనే క్యారెక్టర్ చేస్తున్నారు. అంతేకాదు ఆయన పాత్రకు ‘‘ఇగో కా బాప్’’ అనే క్యాప్షన్ ఇవ్వడం ఆసక్తి కలిగిస్తోంది. దీనికి తగ్గట్టుగానే ఫస్ట్ లుక్‌లో కిశోర్ చాలా సీరియస్‌గా కనిపిస్తున్నారు. దీంతో ఆయన క్యారెక్టర్‌పై ఆసక్తి కలుగుతోంది. మరి ఆయన ఇగోయిజం ఎలా వుంటుందో చూడాలంటే ఆగస్ట్ 12 వరకు వెయిట్ చేయాల్సిందే.

More News

Pawan Kalyan : జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు వైరల్ ఫీవర్... 24న జనవాణి రద్దు

ప్రజల సమస్యలకు పరిష్కారం చూపేందుకు జనసేన పార్టీ తలపెట్టిన జనవాణి జనసేన భరోసా కార్యక్రమానికి మంచి స్పందన వస్తోన్న సంగతి తెలిసిందే.

Parampara 2: సందడిగా డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ "పరంపర 2" ప్రీ రిలీజ్ కార్యక్రమం

డిస్నీప్లస్ హాట్‌స్టార్ లో ఘన విజయం సాధించిన వెబ్ సిరీస్ 'పరంపర' సీజన్ 2 కు రెడీ అవుతోంది.

Matarani Mounamidi: ప్రదీప్ మాచిరాజు చేతుల మీదుగా "మాటరాని మౌనమిది" చిత్రం నుంచి 'ఈ రోజేదో' లిరికల్ సాంగ్ విడుదల

రుద్ర పిక్చర్స్ మరియు పిసిర్ గ్రూప్ సమర్పణలో శుక్ర  దర్శకుడు సుకు పూర్వాజ్ చేస్తున్న కొత్త సినిమా "మాటరాని మౌనమిది".

CPI Narayana : ‘‘ గడ్డి తింటున్నట్లున్నాడు.. కాస్త అన్నం పెట్టండి, మనిషవుతాడు ’’ : సీపీఐ నారాయణకు నాగబాబు కౌంటర్

మెగాస్టార్ చిరంజీవి, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను ఉద్దేశిస్తూ సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి.

CPI Narayana: మెగా ఫ్యాన్స్ దెబ్బ.. చిరుపై వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకుంటున్నా : సీపీఐ నారాయణ

మెగాస్టార్ చిరంజీవిపై తాను చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించారు సీపీఐ నారాయణ. బుధవారం ఓ తెలుగు న్యూస్ ఛానెల్‌తో మాట్లాడిన ఆయన ..