సెప్టెంబర్ మొదటి వారంలో 'లచ్చి' గ్రాండ్ రిలీజ్
Send us your feedback to audioarticles@vaarta.com
ఓ ప్రముఖ ఛానెల్లో వెన్నెల అనే పోగ్రాం ద్వారా బుల్లి తెర ప్రెక్షకులకి దగ్గరైన జయతి మెట్టమెదటిసారిగా హీరోయిన్ గా నటిస్తూ నిర్మిస్తున్న చిత్రం లచ్చి. J9 4షోస్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా ఈశ్వర్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. హార్రర్ కామెడీ లో వైవిధ్యాన్ని ఈ చిత్రం ద్వారా పరిచయం చేస్తున్నారు. షూటింగ్ కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ చిత్రం సెప్టెంబర్ మొదటి వారంలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
ఈసందర్బంగా నిర్మాత, కథానాయిక జయతి మాట్లాడుతూ... "చాలా టీవి ప్రొగ్రామ్స్ ప్రొడ్యూస్ చేసిన అనుభవంతో మెట్టమెదటిసారిగా సినిమా నిర్మాణం చేపట్టాను. అలాగే ఈ చిత్రం కథ నచ్చి నేను మెయిన్ లీడ్ లో నటించాను. హార్రర్ కామెడీ చిత్రాలు చాలానే వచ్చాయి. కానీ లచ్చి చిత్రం కొత్త అనుభూతిని అందిస్తుంది. వైవిధ్యమైన కథ, కథనం ప్రేక్షకుల్ని థ్రిల్ కు గురి చేస్తుంది. ఈ చిత్రం అంతా లచ్చి పాత్ర చుట్లూనే తిరుగుతుంది. అనేక మలుపులు ఆడియెన్స్ ని ఎంటర్ టైన్ చేస్తాయి. ప్రముఖ కమెడియన్స్ కడుపుబ్బా నవ్విస్తారు. అలాగే లెజెండ్ కెమెరామెన్ యం.వి.రఘు గారితో పనిచేయటం చాలా ఆనందంగా వుంది. ఆయన ఈచిత్రాన్ని మరో మెట్టుకి తీసుకువెళ్ళారు. మాటలు మరుదూరి రాజా గారు అందించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి సెప్టెంబర్ మొదటి వారంలో గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం. మా చిత్రాన్ని అందరూ ఆదరిస్తారని ఆశిస్తున్నాము. అని అన్నారు.
మరో కథానాయిక తేజశ్విని మాట్లాడుతూ.. ఈ చిత్రం నాకు డెబ్యు, దర్శకడు ఈశ్వర్ గారు చాలా ఇష్టపడి ప్రతి పాత్రని మలిచారు. మెయిన్ పాత్రలో చేస్తున్నాను. అక్టోబర్ లో చిత్రాన్ని విడుదల చేయటానికి సన్నాహలు చేస్తున్నాము. అని అన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com