ఖాకీ డ్రెస్ లో వెంకీ

  • IndiaGlitz, [Saturday,October 24 2015]

విక్ట‌రీ వెంక‌టేష్.. న‌టించిన గోపాల గోపాల సినిమా సంక్రాంతి కానుక‌గా జ‌న‌వరిలో రిలీజైంది. అంటే ప‌ది నెల‌లు అవుతున్నా..ఇప్ప‌టి వ‌ర‌కు వెంకీ నెక్ట్స్ మూవీ స్టార్ట్ చేయ‌లేదు. ఇటీవ‌ల మారుతి, క్రాంతి మాధ‌వ్ కి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్టు వార్త‌లు వ‌చ్చాయి. కానీ..సెట్స్ పైకి వెళ్ల‌లేదు.

తాజాగా వెంకీ మ‌రో ప్రాజెక్ట్ కి ఓకె చెప్పిన‌ట్టు స‌మాచారం. ఇంత‌కీ ఆ ప్రాజెక్ట్ ఏమిటంటే..రైట‌ర్ వ‌క్కంతం వంశీ వెంకీ కోసం ఓ క‌థ రెడీ చేసాడ‌ట‌. ఇందులో వెంకీ పోలీస్ గా క‌నిపిస్తాడ‌ట‌. ఈ ప్రాజెక్ట్ కి గోపాల గోపాల డైరెక్ట‌ర్ డాలీ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్న‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతుంది. మ‌రి...మారుతి, క్రాంతి మాధ‌వ్, డాలీ..ఈ ముగ్గురిలో ఎవ‌రి ప్రాజెక్ట్ ముందు స్టార్ట్ చేస్తాడో..? చూడాలి.