పోలీస్ పాత్రలో వెంకీ..
Send us your feedback to audioarticles@vaarta.com
విక్టరీ వెంకటేష్ గోపాల గోపాల తర్వాత ఇన్నాళ్లకు న్యూ ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తున్నారు. ఈ చిత్రానికి యూత్ ఫుల్ డైరెక్టర్ మారుతి దర్శకత్వం వహించనున్నారు. ప్రస్తుతం స్ర్కిప్ట్ వర్క్ జరుగుతోంది. డిసెంబర్ 16న ఈ మూవీని ప్రారంభించి జనవరి నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించడానికి ప్లాన్ చేస్తున్నారు.
ఈ చిత్రంలో వెంకటేష్ పోలీస్ పాత్రలో నటించనున్నట్టు సమాచారం. పోలీస్ అంటే సీరియస్ పోలీస్ అనుకుంటే పొరపాటే. కామెడీ పోలీస్ గా వెంకీ కనిపిస్తాడట. భలే భలే మగాడివోయ్ ఎలా ఎంటర్ టైనింగ్ గా ఉందో ఈ మూవీ కూడా అలా ఎంటర్ టైన్మెంట్ గా ఉంటుందట. ఈ చిత్రంలో వెంకీ సరసన నయనతార నటిస్తుంది. హారికా అండ్ హాసిని బ్యానర్ పై సూర్యదేవర రాథాక్రిష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి రాధా క్రిష్ణ అనే టైటిల్ ప్రచారంలో ఉన్నప్పటికీ వేరే టైటిల్ పరిశీలిస్తున్నట్టు సమాచారం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com