క్లాసులకు వెళుతున్న వెంకీ....
Send us your feedback to audioarticles@vaarta.com
విక్టరీ వెంకటేష్ బాబు బంగారం తర్వాత బాలీవుడ్ మూవీ సాలా ఖద్దూస్ చిత్ర రీమేక్ కోసం కసరత్తులు మొదలెట్టేశాడు. బాక్సింగ్ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో బాలీవుడ్ మాతృకలో నటించిన రితిక సింగ్ పాత్రలో ఆమెనే నటిస్తుంది. సుధకొంగర నటిస్తున్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్‌లోకి వెళ్ళనుంది. ఈ చిత్రంలో వెంకటేష్ బాక్సింగ్ కోచ్‌గా నటిస్తున్నాడు. ఈ సినిమా కోం అల్రెడి బైసెప్స్ పెంచిన వెంకటేష్ పాత్రకు అనుగుణంగా ప్రొఫెషనల్‌గా కనపడాలని ఓ బాక్సింగ్ ట్రైనర్‌ను నియమించుకుని బేసిక్ మెళకువలను నేర్చుకుంటన్నాడని విశ్వసనీయ వర్గాల సమాచారం. స్పోర్ట్స్ డ్రామాలో వెంకటేష్ ఈ తరహా సినిమాలో నటించనుండటం ఇదే తొలిసారి. ప్రస్తుతం వెంకటేష్, మారుతి కాంబినేషన్‌లో రూపొందిన బాబు బంగారం ఆగస్ట్ 12న విడుదలకు సిద్ధమైంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com