'వెంకీ మామ' రిలీజ్ డేట్ ?
Send us your feedback to audioarticles@vaarta.com
విక్టరీ వెంకటేశ్, అక్కినేని నాగచైతన్య, రాశీఖన్నా, పాయల్ రాజ్‌పుత్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న చిత్రం `వెంకీమామ`. ఈ సినిమా విడుదలపై ఓ స్పష్టత రాలేదు. అప్పుడు విడుదలవుతుంది.. ఇప్పుడు విడుదలవుతుందంటూ వార్తలు వినపడుతూనే ఉన్నాయి. అయితే లేటెస్ట్ సమాచారం మేరకు ఈ సినిమా విడుదల విషయంలో నిర్మాతల్లో ఒకరైన డి.సురేష్‌బాబుకి ఓ క్లారిటీ వచ్చిందట. ఓ నెల పాటు ఈ సినిమాను ఎప్పుడు విడుదల చేయాలనే దానిపై చర్చలు జరుగుతూనే ఉన్నాయి. చివరకు సినిమాను డిసెంబర్ 13న విడుదల చేయడానికి డి.సురేష్‌బాబు నిర్ణయించుకున్నారని టాక్.
రియల్ లైఫ్‌లో మామ అల్లుళ్లైన వెంకటేశ్, నాగచైతన్య రీల్‌పై కూడా మామ, అల్లుడుగా అలరించబోతున్నారు. వెంకటేశ్ రాజమండ్రి పక్క నుండే మోతుబరి రైతు పాత్రలో కనపడబోతుండగా చైతన్య సైన్యంలో పనిచేసే యువకుడిగా కనపడబోతున్నాడట. ఇప్పటికే ఈ సినిమా టీజర్ విడుదలైంది. టైటిల్ సాంగ్ విడుదలైంది. శనివారం ఎన్నాళ్లకో.. అనే రెట్రో సాంగ్ కూడా విడుదల కానుంది. సురేష్ ప్రొడక్షన్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్స్‌పై టీజీ విశ్వప్రసాద్, డి.సురేష్‌బాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కె.ఎస్.రవీంద్ర(బాబీ) దర్శకుడు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com