రీమేక్ ఆలోచనలో వెంకీ...

  • IndiaGlitz, [Wednesday,January 27 2016]

స్పోర్ట్స్ డ్రామా నేప‌థ్యంలో తెరకెక్కిన చిత్రం సాలా ఖ‌ద్దూస్‌. సుధా కొంగ‌ర ప్ర‌సాద్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో మాధ‌వ‌న్‌, రితిక సింగ్‌లు న‌టించారు. మాధ‌వ‌న్ బాక్సింగ్ కోచ్‌గా న‌టిస్తే, రితిక అత‌ని శిష్యురాలిగా న‌టిస్తుంది. ఈ సినిమాను త‌మిళంలో ఇరుది సుట్రు అనే పేరుతో డ‌బ్ చేసి జ‌న‌వరి 29న విడుద‌ల చేస్తున్నారు.

ఈ చిత్రాన్ని రీసెంట్‌గా ఓ సీనియ‌ర్ తెలుగు హీరో చూసి రీమేక్ చేయ‌డానికి ఓకే చెప్పాడ‌ని ద‌ర్శ‌కురాలు తెలియ‌జేసింది. అయితే ఆ హీరో పేరును మాత్రం చెప్ప‌లేదు. అయితే వెంక‌టేష్ ఈ చిత్రం రీమేక్ చేయ‌డానికి ఆస‌క్తిగా ఉన్నాడ‌ని ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో టాక్ విన‌ప‌డుతుంది.