వెంకీ మామ: మామ, అల్లుడు అదరగొట్టేశారు!

  • IndiaGlitz, [Friday,August 02 2019]

క్రేజీ కాంబినేషన్ వెంకటేష్, నాగచైతన్య ప్రధాన పాత్రల్లో బాబీ తెరకెక్కిస్తున్న చిత్రం ‘వెంకీ మామ’. దర్శకుడు కేఎస్‌ రవీంద్ర అలియాస్ బాబీ పుట్టినరోజు సందర్భంగా చిత్రబృందం మేకింగ్ విడుదల చేసింది. కాగా.. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఈ చిత్రం వస్తోంది. బాబీ బర్త్ డే సందర్భంగా.. మేకింగ్ వీడియోను దగ్గుబాటి రానా తన ట్విటర్‌‌లో పోస్ట్‌ చేశారు. ఈ సందర్భంగా దగ్గుబాటి మామ, అక్కినేని అల్లుడు ఇద్దరూ బాబీకి బర్త్ డే శుభాకాంక్షలు తెలిపారు.

మేకింగ్ వీడియో రివ్యూ..!

కేవలం 28 సెకన్లు మాత్రమే ఉన్న ఈ మేకింగ్ వీడియోలో ఎలాంటి డైలాగ్స్ లేవు. ఆరంభంలోనే బాబీ.. టేక్, కెమెరా, యాక్షన్ చెబుతారు. మొదట బుల్లెట్ బండిపై మీసం తిప్పుతూ ఉండగా.. చైతూ తన సన్నిహితులతో కలిసి టీ షర్టులో నడుచుకుంటూ వస్తారు. ఆ తర్వాత గుడి బ్యాగ్రౌండ్‌తో వెంకీ మామ, అక్కినేని అల్లుడు ఇద్దరూ రెడ్ షర్ట్‌ను జబ్బల పైకి లాగుతూ.. నడుచుకుంటూ వస్తున్నారు. బాగ్రౌండ్ మ్యూజిక్ మాత్రం అదుర్స్ అనిపించింది. అంతేకాదు.. వెంకీ బుల్లెట్‌‌పై ఉన్న బ్యాగ్రౌండ్‌, మామాఅల్లుళ్లు నడుచుకుంటూ వస్తున్న బ్యాగ్రౌండ్‌ను బట్టిచూస్తే పల్లెటూరు నేపథ్యంలో సినిమా ఎక్కువగా ఉంటుందని అర్థమవుతోంది.

వీడియోపై టాక్ ఏంటి..!?

కాగా.. ఈ మేకింగ్ వీడియోను దగ్గుబాటి, అక్కినేని అభిమానులు బాగానే ఆదరించారని చెప్పుకోవచ్చు. వీడియో ఇప్పటికే 584,806 వ్యూస్ సంపాదించుకోగా.. సుమారు 600 దాకా కామెంట్స్ వచ్చాయి. అయితే ఈ కామెంట్స్‌లో అన్నీ ఎలాంటి నెగిటివ్ కాకుండా పాజిటివ్‌ మాత్రమే రావడం విశేషమే. కచ్చితంగా వంద కోట్లు క్రాస్ చేయడం పక్కా అని ఫ్యాన్స్ చెబుతున్నారు. ‘దగ్గుబాటి మామా. అక్కినేని అల్లుడు.. ‘వెంకీమామ’ కోసం వెయిటింగ్ ఇక్కడ’ అంటూ మరికొందరు వీరాభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.

ఇదిలా ఉంటే.. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి టీజర్‌ను సైతం విడుదల చేస్తామని చిత్ర బృందం ఓ ప్రకటనలో తెలిపింది. కాగా రీల్ లైఫ్‌లోనే కాదు రియల్‌గానే అక్కినేని నాగచైతన్యకు స్వయానా వెంకటేష్ మేనమామ అనే విషయం తెలిసిందే. ఇప్పటికే ప్రేమమ్ చిత్రంలో అతిథి పాత్రలో నాగచైతన్యతో వెంకీ స్క్రీన్ షేర్ చేసుకోగా.. తాజాగా ‘వెంకీమామ’ చిత్రంతో వచ్చేస్తున్నారు. ఇప్పటికే పలు మల్టీస్టారర్ సినిమాల్లో.. పలువురు టాప్ హీరోల సరసన నటించిన వెంకీ మామ.. ఈసారి తన రియల్ అల్లుడితో వచ్చేస్తున్నారు.

ఈ సినిమా కూడా మరో ‘గోపాల గోపాల’ నో లేదా మరో ‘ఎఫ్-2’లాగా సూపర్ డూపర్ హిట్ అవ్వాలని కోరుకుందాం. కాగా.. ఈ చిత్రంలో పాయల్‌ రాజ్‌పుత్‌, రాశీ ఖన్నాలు హీరోయిన్లుగా నటిస్తుండగా.. ఈ మూవీకి తమన్‌ సంగీతాన్ని అందిస్తున్నారు.

More News

ఆగస్ట్ 9న మహేశ్ ఫ్యాన్స్‌కు సర్‌ఫ్రైజ్..

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టిన రోజు ఆగస్ట్-09 అన్న విషయం తెలిసిందే. నిజంగా ఇది మహేశ్ అభిమానులు పెద్ద పండుగ రోజే. ఆ రోజు ఇక తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా...

నాగ్ దెబ్బకు ఎన్టీఆర్ రికార్డ్ బద్దలైందిగా!!

తెలుగు రియాల్టీ షో బిగ్‌బాస్-1 జూనియర్ ఎన్టీఆర్‌తో, సీజన్-2 నేచురల్ స్టార్ నానితో.. మూడో సీజన్‌ను అక్కినేని నాగార్జునతో ‘మా’ టీవీ యాజమాన్యం, నిర్వాహకులు గట్టిగానే ప్లాన్ చేశారు.

ప్రేక్ష‌కుల‌ను మెప్పించే ఇన్‌టెన్సివ్ థ్రిల్ల‌ర్ 'రాక్ష‌సుడు': బెల్లంకొండ శ్రీనివాస్‌

డిఫరెంట్‌ కాన్సెప్ట్‌ చిత్రాలతో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న యంగ్‌ అండ్‌ ఎనర్జిటిక్‌ హీరో బెల్లంకొండ శ్రీనివాస్‌ కథానాయకుడిగా 'రైడ్‌', 'వీర' చిత్రాల దర్శకుడు రమేష్‌వర్మ పెన్మత్స

విడిపోతున్నామ‌ని ప్ర‌క‌టించిన హీరోయిన్‌

బాలీవుడ్ హీరోయిన్ దియామీర్జా త‌న వివాహ బంధానికి ఫుల్ స్టాప్ పెట్టేశారు. ఈ హైద‌రాబాదీ హీరోయిన్ భ‌ర్త సాహిల్ సింఘా నుండి విడాకులు తీసుకోబోతున్న‌ట్లు ప్ర‌క‌టించారు. వ్యాపార‌వేత్త సాహిల్ సింఘాతో చాలా

ఆగస్ట్‌ 23న ప్రపంచవ్యాప్తంగా 'కౌసల్య కృష్ణమూర్తి'

ఐశ్వర్యా రాజేష్‌, నటకిరీటి డా.రాజేంద్రప్రసాద్‌, కార్తీక్‌ రాజు, వెన్నెల కిషోర్‌ ముఖ్య పాత్రల్లో క్రియేటివ్‌ కమర్షియల్స్‌ పతాకంపై భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో