జీవితంలో ఒక్కసారే ఇలాంటి ఛాన్స్ .. చిరు సార్ నమ్మకం నిలబెడతా: వెంకీ కుడుముల
Send us your feedback to audioarticles@vaarta.com
మెగాస్టార్ చిరంజీవితో ఒక్కసారైన సినిమా తీయాలని దర్శకులు, నిర్మాతలు .. ఆయనతో కలిసి పనిచేయాలని హీరోయిన్లు, ఇతర టెక్నషీయన్ల కల. స్వయంకృషితో మెగాస్టార్ స్థాయికి చేరుకున్న ఆయన జీవితం ఎందరికో ఆదర్శం. చిరంజీవిని స్పూర్తిగా తీసుకుని ఇండస్ట్రీకి వచ్చిన వారెందరో. అలా ఆయనను ఆదర్శంగా టాలీవుడ్‌కు వచ్చిన ఓ వ్యక్తికి .. మెగాస్టార్‌తోనే కలిసి పనిచేసే అవకాశం వస్తే నిజంగా పండగే కదా. ఈ అదృష్టం యువ దర్శకుడు వెంకీ కుడుములని వరించింది. కేవలం రెండే సినిమాలు తెరకెక్కించిన వెంకీకి చిరంజీవి 156వ చిత్రాన్ని తెరకెక్కించే అవకాశం దక్కింది.
ఈ సంతోషాన్ని వెంకీ కుడుముల తట్టుకోలేకపోతున్నారు.. ఆ ఎగ్జయిట్మెంట్లో తన ఆనందాన్ని పంచుకుంటూ ట్వీట్ చేశారు. ఇలాంటి అవకాశాలు జీవితంలో ఒకేసారి వస్తాయ్.. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చిరంజీవి సార్‌కు థ్యాంక్స్. మీరు నాపై పెట్టుకున్న నమ్మకం, మీ పట్ల నాకున్న ఆరాధ్య భావమే నన్ను ముందుకు తీసుకెళ్తాయ్.. నా శక్తిని మించి పని చేసే ధైర్యాన్నిస్తాయ్.. అంటూ ఆయన పేర్కొన్నారు. దీనిపై హీరో నితిన్, హీరోయిన్ రష్మిక మందన్నలు సైతం వెంకీ కుడుములకు విషెస్ చెప్పారు.
కాగా.. చిరంజీవి హీరోగా ప్రముఖ నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆర్ఆర్ఆర్ వంటి భారీ పాన్ ఇండియా మూవీ తర్వాత డీవీవీ దానయ్య నిర్మిస్తుండటంతో ఈ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలున్నాయి. డాక్టర్ మాధవి రాజు సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్, మ్యూజిక్ డైరెక్టర్ ఇతర టెక్నీషీయన్ల వివరాలను చిత్ర యూనిట్ త్వరలోనే వెల్లడించనుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments